Advertisement
పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని పవన్ ప్రజలకు పిలుపిస్తున్నారని.. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను మూడు పెళ్లిళ్లు చేసుకోమని పవన్ ప్రేరేపిస్తున్నారని ఆగ్రహించారు. మా విధానం మూడు రాజధానులైతే.. జనసేన విధానం మూడు పెళ్లిళ్లు అని చురకలు అంటించారు మంత్రి గుడివాడ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ ఎపిసోడ్‌పై మంత్రి అమర్నాధ్ ఆగ్రహించారు.
Advertisement
జనసేన నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పవన్ కామెంట్లని గమనించి జాగ్రత్త పడాలని కోరుతున్నానని చెప్పారు. తమ విధానం మూడు పెళ్ళిళ్లు అని చెప్పడానికే పవన్ విశాఖ వచ్చాడా..? అని నిలదీశారు. పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్మెంట్.. పెళ్లాంతోనే అడ్జస్ట్ కాలేని పవన్.. ప్రజలతో ఎడ్జస్ట్ అవుతారు..? అని ప్రశ్నించారు. పవన్ 1.80 లక్షల పుస్తకాలు చదివింది దీనికోసమేనా..? అని ఆగ్రహించారు. నేను వెళ్లనంటే.. వెళ్లకు ఇక్కడే ఉండు… పవన్ విశాఖలో ఉన్నంత వరకు ఆడపిల్లలెవరూ బయటకు రావద్దని కోరుతున్నానని పేర్కొన్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కితే పవన్ ఏం చేస్తారోననే ఆందోళన మాకుందన్నారు.
Advertisement
విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికి మాత్రమే పవన్ విశాఖ టూర్ పెట్టుకున్నారు… పవన్ దిగకముందే సైకోలతో మంత్రులపై దాడి చేయించారని నిప్పులు చెరిగారు. గర్జన అంశం డీవియేట్ అయిందని.. నిన్న జరిగిన దాడి ఉత్తరాంధ్ర ఆకాంక్షలపై జరిగిన దాడి అన్నారు. పవన్ ప్యాకేజ్ స్టార్ అని ప్రజలు బలంగా నమ్మేలా వ్యవహరిస్తున్నారు…. సీఎంను గఢాఫీతో పోలుస్తూ ఏదేదో కామెంట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాణి కార్యక్రమం మొదలు పెట్టిందే ఈ మధ్య కాలంలో.. అలాంటిది విశాఖలో జనవాణి కార్యక్రమం 3 నెలల క్రితమే ఫిక్స్ అయిందని పవన్ ఎలా చెబుతారు..? విశాఖ వెళ్లేందుకు చంద్రబాబుకు పవన్ మూడు రోజుల కాల్షీట్లు ఇచ్చారన్నారు. విశాఖ కాల్షీట్లిచ్చిన పవన్.. మూటలు కట్టుకుని పవన్ వెళ్లిపోతారని.. పవన్ ఓ రాజకీయ ఉగ్రవాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు సైకోలు.. సంఘ విద్రోహ శక్తులన్నారు.
Read Also : ‘గాడ్ ఫాదర్’ లో సత్యదేవ్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా!