Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా మంచి గుర్తింపును సాధించింది అనసూయ. ఆమె యాంకర్ గానే కాకుండా తన అందచందాలతో సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. అయితే తాజాగా అనసూయ తన భర్త పై ఓ కామెంట్ చేసిన నెటిజన్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు.. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో ఫోటోలు పంచుకుంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది అనసూయ. నీతో లైఫ్ చాలా క్రేజీగా రోలర్ కోస్టర్ రైడర్ గా ఉంటుందని రాసుకొచ్చింది. దీనికి వెంటనే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ అలా ఏం లేదు అక్క వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే అంటూ కామెంట్ చేశాడు..
Advertisement
Advertisement
దీంతో అనసూయకు కోపం వచ్చింది.. ఆ కామెంట్ కు బదులిస్తూ అదేంట్రా తమ్ముడు అలా అనేసావు.. ఎంతుందేంటి డబ్బు.. నాకు లేదా మనీ మరి.. నీకు అన్నీ తెలుసు కదా.. చెప్పు.. అయినా ఆయన డబ్బు నా డబ్బు అనేది కూడా ఉందా.. రేయ్ చెప్పరా బాబు.. అయినా బావ గారిని వాడు వీడు అనొచ్చా.. ఇదేం పెంపకం రా నీది.. చెంపలేసుకో.. లేకుంటే నేను వేస్తా చెప్పులతో.. అంటూ ఆ నెటిజన్ కు షాక్ ఇచ్చింది. ఆ నెటిజన్ ఇంకో కామెంట్ కు బదులిస్తూ.. పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే ఉంటుందని.. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి చెడు చెబుతున్న..
ఏమనుకోకయ్యా ..అంటూ బదిలిచ్చింది.. నా ఇంస్టాగ్రామ్ లో నేను ఏ ఫోటో పెట్టుకుంటే నీకేం ప్రాబ్లం రా.. నచ్చకపోతే ఫాలో అవ్వడం ఎందుకు.. దొబ్బెయ్.. అంటూ షాక్ ఇచ్చింది.. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ సినీ కెరియర్ విషయానికి వస్తే ఈమె టీవీ రంగానికి గుడ్ బై చెప్పి సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందని చెప్పవచ్చు.
also read:లైకుల కోసం మరీ ఇంతలా..! ఈ జంట చేసిన పనికి నెటిజెన్లు ఏమంటున్నారంటే..?