Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు.. అందులో ప్రత్యేకమైన వాక్చాతుర్యం ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సుమా.. ఈమె మైక్ పట్టింది అంటే స్టేజ్ పై అన్ని కోణాల్లో సంభాషణలు రక్తి కడతాయి.. ఇక కామెడీ మాత్రం మాటల్లో చెప్పలేం. సమయానికి తగ్గట్టు పంచులు, ఎక్కడ ఎవరిని ఎత్తుకోవాలి, ఎవరిని తగ్గించా లో, కామెడీ ఎక్కడ పండించాలో సమయానికి తగ్గట్టు ఏది చేస్తే బాగుంటుందో అలా అన్నీ తెలిసిన సమయస్ఫూర్తి ఉన్న యాంకర్ సుమ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైనా, సక్సెస్ మీట్ లైన, ఏదైనా ఇంటర్వ్యూ లైనా తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే అనుకుంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఎందుకంటే సుమ యాంకరింగ్ ఆడియన్స్ కి తొందరగా కనెక్ట్ అవుతుంది.
Advertisement
also read: ANRతో అస్సలు నటించనని తెగేసి చెప్పిన NTR.. వారి మధ్య అంతటి వైరానికి కారణం..!!
Advertisement
ఈ విధంగా మూడు సినిమాలు, ఆరు ఇంటర్వ్యూలు గా ఇండస్ట్రీ లో బిజీగా కొనసాగుతోంది యాంకర్ సుమ.ఒక వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ లో వంటల ప్రోగ్రామ్స్,షూటింగ్స్ కి సంబంధించిన వీడియోలు, ఇతర సంభాషణలు అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది యాంకర్. కానీ ఇటీవలే ఆమె వరలక్ష్మి పూజకు సంబంధించి షాపింగ్ చేయడం కోసం మాల్ కి వెళ్ళింది. దీంతో అక్కడ ఒక నిజాన్ని బయట పెట్టింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..
సుమ షాప్ వ్యక్తితో చీరలు ఏ రేంజ్ వి చూపించాలో అని అడుగుతూ తొందరపాటులో తన పెళ్లి చీర ధర 11000 అంటూ చెప్పేసింది.. అలా చెప్పిన వెంటనే మళ్ళీ కవర్ చేసుకునే విధంగా అంటే అప్పుడు ఎప్పుడో అనుకునేరు ఈమధ్యనే అంటూ చెప్పుకొచ్చింది. కుమార్ రాజీవ్ కనకాల పెళ్లి 1999 లో జరిగింది. అంటే అప్పట్లో 11 వేల ఖరీదు గల చీర అంటే ధర ఎక్కువ అని చెప్పాలి.. సాధారణంగా కుటుంబం అన్నాక భార్యా భర్తల మధ్య గొడవలు మనస్పర్థలు రావడం కామన్ అని, అలా గొడవలు వచ్చినా ఒకరికి ఒకరు సర్దుకొని జీవితాన్ని సాఫీగా ముందుకు సాగాలని అలా అయితేనే దాంపత్య జీవితం బాగుంటుందని చెప్పింది.
also read: