Advertisement
Aneesha Dama: పరశురాం దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “గీతా గోవిందం”. 2018 లో విడుదలైన గీతాగోవిందం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక డైలాగ్స్, లవ్ స్టోరీ అభిమానులను మెప్పించాయి. అయితే ఈ చిత్రంలో రష్మిక కంటే ఎక్కువగా స్పెషల్ అట్రాక్షన్ అయింది ఓ అమ్మాయి. ఈ మూవీలో ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ.. ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది.
Advertisement
Read also: స్టార్ హీరో సినిమాల కైతే అలా నాని సినిమాకి ఇలా…? “దసరా” సినిమాని అణిచి వేస్తున్నారా?
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లెక్చరర్ పాత్రలో నటించగా.. విజయ్ దేవరకొండ ను ప్రేమించిన టీనేజ్ అమ్మాయి పాత్రలో నటించింది అనిషా దామ. విజయ్ ని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని వెంటపడే పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కనిపించింది తక్కువే. ఈమె మహర్షి, గీత గోవిందం వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత ఓ బేబీ సినిమాలో రావు రమేష్ కూతురిగా నటించింది. కానీ ఈ చిత్రాలు ఏవి ఆమెకి అంతగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు. 1996 సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో జన్మించింది అనిషా దామా.
Advertisement
ఇక ఈమె ప్రస్తుతం ఇటీవలే ఆహ లో స్ట్రీమింగ్ అవుతున్న “సత్తిగాని రెండెకరాలు” అనే చిత్రంలో కథానాయకగా నటించింది. “అమ్ముతడా.. సస్తడా” అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి అభినవ్ దండా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పుష్ప ఫేం నటుడు కేశవ హీరోగా కనిపించాడు. ఈ చిత్రాన్ని హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు ప్రాంతంలో చిత్రీకరించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ లభిస్తుంది. అయితే తెలుగులో అనీషా కథానాయికగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.