Advertisement
భోళా శంకర్ సినిమాకి ఊహించిన స్థాయిలో ఫలితం రాలేదు. నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా చిరంజీవి అనవసరంగా ఈ సినిమా చేశారంటూ ఫాన్స్ బాధపడుతున్నారు తప్ప ఈ సినిమా వలన ఉపయోగం ఏమీ లేకపోయింది. కచ్చితంగా సినిమా డిజాస్టర్ అవుతుందని క్లియర్ గా తెలుస్తోంది. చిరంజీవి రెమ్యూనరేషన్ మీద ఇప్పుడు జోరుగా చర్చలు వినపడుతున్నాయి.
Advertisement
నిర్మాతకు చిరంజీవికి మధ్య గ్యాప్ పెరిగిందని బ్యాలెన్స్ రెమ్యూనిరేషన్ ఇవ్వమని పీడించారని ఆ డబ్బులని చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడని, అమ్ముకున్నాడు అని రూమర్లు వస్తున్నాయి. చిరంజీవికి ఈ సినిమాతో 65 కోట్ల రెమ్యూనిరేషన్ ఇద్దామని అనుకున్నారు 50 కోట్ల వరకు ఇచ్చారని టాక్ నడుస్తోంది. మిగిలిన డబ్బులు ఇవ్వమని చిరంజీవి అడిగారు. నిర్మాత గతిలేక ఆస్తులని ప్రాపర్టీలని అమ్ముకున్నారని అనేక వార్తలు వచ్చాయి.
Advertisement
ఇలా వార్త రావడంతో చిరంజీవి మీద, మెగా ఫ్యామిలీ మీద విపరీతంగా ట్రోల్లింగ్ మొదలైంది. సాయి రాజేష్ వంటి కొంత మంది అభిమానులు ఈ రూమర్లని ఖండించడానికి ట్రై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెమ్యూనరేషన్ కోసం ఇలా చేస్తున్నారని చిరంజీవి మీద అనిల్ సుంకర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక మెగా అభిమాని నేరుగా నిర్మాతకే ఈ వార్తల్ని పంపించారట.
ఇక దీని గురించి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అనిల్ సుంకర చేసిన వ్యాఖ్యల గురించి చూపిస్తూ ఇది నిజమేనా అని ఒక అభిమాని అడిగాడు. నేను ఇప్పుడు అమెరికా వెళుతున్నాను అని అనిల్ సుంకర అతనికి రిప్లై ఇచ్చారు. కొంచెం చూడండి ఈ వార్త వైరల్ అవుతోంది అని చెప్పగా.. పట్టించుకోవద్దండి నేను మళ్ళీ చిరంజీవి గారితో ఇంకో సినిమా చేస్తాను ఆయన మంచివారు. సినిమాతో సమాధానం చెబుదామని అనిల్ సుంకర చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాట్సప్ చాట్ వైరల్ అవుతోంది.
Also read: