Advertisement
Animal Movie Review : యానిమల్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగ, సౌరభ్ గుప్తా స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి నటించారు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ అందించగా సందీప్ రెడ్డి వంగా ఎడిటింగ్ చేసారు.
Advertisement
Also Check: Animal OTT Platform and OTT Rights
చిత్రం : యానిమల్
నటీనటులు : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి తదితరులు
దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
నిర్మాత : భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ
విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
Animal Movie Story: కథ మరియు వివరణ:
ఇక సినిమా విషయానికి వస్తే.. రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి తదితరులు ఈ మూవీ లో నటించడం జరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. తాజాగా ఉమైర్ సంధు యానిమల్ కి సంబంధించి ఓ రివ్యూ ఇచ్చాడు. ప్రధానంగా తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా చాలా అద్భుతంా ఉందట. అంతేకాదు.. యాక్షన్ సీన్స్ ని దర్శకుడు చాలా అద్భుతంగా డిజైన్ చేశాడని.. నటీనటుల పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంటాయట. అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని.. యూత్ ని అవి ఆకట్టుకుంటాయని రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ చిత్రానికి అతను 4/5 రివ్యూ రేటింగ్ ఇవ్వడం విశేషం. వాస్తవానికి ఉమైర్ సంధు గురించి తెలిసిన వారెవ్వరూ అతని రివ్యూలను పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేవాడు.
Advertisement
కానీ కొద్దిరోజుల కిందట నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నాడు. అంతేకాదు.. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చాలా ఫేక్ న్యూస్ రాస్తున్నాడు. చాలా మంది ఉమర్ సంధు గురించి కేసులు కూడా నమోదు చేసినట్టు సమాచారం. ఇక కథ విషయానికి వస్తే.. అర్జున్ (రణబీర్ కపూర్) ఒక రిచ్ ఫ్యామిలీ అబ్బాయి. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఏమో బిజినెస్ మ్యాన్. ఎంత ఆస్తి ఉన్నా కూడా అర్జున్ కి తండ్రి ప్రేమ మాత్రం లేదు. తండ్రి ప్రేమ కోసం ఆయనకి నచ్చిన పనులు చేస్తూ ఉంటాడు. అర్జున్ ఫ్రెండ్ కార్తీక్ స్నేహితురాలు గీతాంజలి (రష్మిక మందన్న). ఆమె ని ఇష్టపడతాడు అర్జున్. తండ్రి కోసం అర్జున్ చేసే పనులు వలన గీతాంజలి కి ఇబ్బందులు వస్తాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న కొన్ని సంవత్సరాల తర్వాత బల్బీర్ సింగ్ పై దాడి జరుగుతుంది.
బల్బీర్ సింగ్ మీద దాడి ఎవరు చేశారు…? అప్పుడు అర్జున్ ఏం చేశాడు…? పగ ఎలా తీర్చుకున్నాడు…? అర్జున్ తండ్రికి అర్జున్ ప్రేమ తెలిసిందా..? తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ కథ మామూలుగానే ఉంటుంది. కానీ బాగా కోపం ఉన్న ఒక అబ్బాయి ఎలాంటి సమస్యల్లో పడతారు అనేవి రీయల్ గా వున్నాయి.అలానే, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి దూరం అయితే, వాళ్లు ఎలా అవుతారు అనే దాన్ని కూడా చూపించారు. సందీప్ రెడ్డి మూవీ విషయంలో చాలాదాకా సక్సెస్ అయ్యారు.
మూవీ చూస్తుంటే అర్జున్ రెడ్డి గుర్తుకు వస్తాడు. నటీనటులు అందరూ కూడా వాళ్ళ పాత్రలకి న్యాయం చేసారు. హీరో రణబీర్ కపూర్ లో కొత్త కోణం కనపడుతుంది. ఎమోషనల్ సీన్స్ లో రణబీర్ కపూర్ ని చూస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది. గీతాంజలి పాత్రలో రష్మిక బాగా నటించింది. మూవీలో పాటలు కూడా బాగున్నాయి. డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా చాలా పెద్దగా ఉండడం ఒక్కటే మైనస్.
ప్లస్ పాయింట్స్ :
రణబీర్ కపూర్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
యాక్షన్ సీన్స్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
లెన్తీ గా మూవీ ఉండడం
రేటింగ్ : 3/5
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!