Advertisement
Anjaneya Yadav: మంచి మనసుతో ఇతరులకి సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు (Anjaneya Yadav). తమ సంపాదనలో కొంత సంపాదన సహాయం చేయడానికి కొందరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏమీ లేని వాళ్ళకి అండగా నిలుస్తారు. ఇతను చేసిన పని చూస్తే ఖచ్చితంగా శభాష్ అంటారు. కూలిపాలనలు చేస్తూ విద్యార్థులకు సహాయాన్ని అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే కూలి పనులు చేసే ఒక వ్యక్తి కాలిబాటన నడిచే విద్యార్థులకి సైకిళ్ళు కొని ఇచ్చారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక రాష్ట్రం లోని దేవదుర్గ తాలూకాకి చెందిన ఆంజనేయ యాదవ్ మంచి మనసుని చాటుకున్నారు. ఆంజనేయ యాదవ్ కూలి పనులు చేస్తూ ఏకంగా 40 వేల రూపాయలు సంపాదించారు.
Advertisement
Advertisement
విద్యార్థులు రోజు నాలుగు కిలోమీటర్లు హై స్కూల్ కి నడుచుకుని వెళ్తున్నారని తెలిసి విద్యార్థినులకి మేలు జరగాలని 11 సైకిళ్లు ని కొని ఇచ్చారు. సైకిళ్లను పంపిణీ చేస్తూ ఆంజనేయ యాదవ్ మాట్లాడారు. రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుండి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చదువుని మధ్యలోనే ఆపేస్తున్నారని ఆయన అన్నారు. ఈ పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోకూడదని సైకిళ్లను పంపిణీ చేశానని అన్నారు. ఇది చూసిన నెటిజెన్ల ఆంజనేయ యాదవ్ నిజమైన ధనవంతుడని మెచ్చుకుంటున్నారు. కొంతమంది నెటిజెన్స్ అయితే ఆంజనేయ యాదవ్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే అని కామెంట్లు చూస్తున్నారు.
పిల్లల చదువు కోసం ఈ విధంగా సహాయం చేసే మంచి మనసు కొంతమందికే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఆంజనేయ యాదవ్ రాబోయే రోజుల్లో మరింత మందికి సహాయం చేయాలని నెటిజెన్స్ కోరుకుంటున్నారు. ఆంజనేయ యాదవ్ చేసిన మంచి పనికి శభాష్ అంటున్నారు విద్యార్థులు చదువు ఆగిపోకూడదని పెద్ద మనసుతో ఇంత గొప్ప సహాయాన్ని అందించారు చాలా మంది విద్యార్థులకు ఆంజనేయ యాదవ్ చేసిన సహాయం ఉపయోగపడుతుంది. విద్యార్థులు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!