Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. 11 రోజుల కిందట నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు లో భాగంగా ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడును గుర్తించి ఏపీ సి ఐ డి పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
వీటిని కూడా చదవండి: Jr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
వీటిని కూడా చదవండి: ఎన్టీఆర్ సినిమాలు చూడము అన్న TDP ఫాన్స్ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫాన్స్ !
అరెస్టు చేసిన… ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు లో చంద్రబాబు నాయుడును ఉంచారు పోలీసులు. ఇక 11 రోజులుగా చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు బయటకి రాకుండా… సిఐడి పోలీసులు కూడా రోజుకు కేసు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణాన్ని తెరపైకి తీసుకువచ్చారు పోలీసులు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని తాజాగా కోర్టు ముందు సాక్షాలు ప్రవేశపెట్టినట్లు సమాచారం అందుతోంది.
Advertisement
అసలు ఫైబర్ గ్రిడ్ కేసు అంటే ఏంటి ?
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత మెడకు ఫైబర్ గ్రిడ్ కేసు చుట్టుకుంది. ఈ ఫైబర్ గ్రిడ్ ఒప్పందంలో భాగంగా… అప్పటి ప్రభుత్వానికి చెందిన 115 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో A1 గా వేమూరి హరిప్రసాద్ ఉన్నారు. ఈ వేమూరి హరిప్రసాద్ నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్రను సిఐడి పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడును విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని సిఐడి పేర్కొంది. ఇందులో భాగంగానే పీటీ వారంటీ దాఖలు చేసింది. 2017 సంవత్సరం జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఉద్దేశపూర్వకంగానే బిడ్ ను సమర్పించే చివరి తేదీని తొలగించినట్లు సిఐడి తన ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది. ఈ స్కాం జరిగిన సమయంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. దీంతో త్వరలోనే నారా లోకేష్ ను కూడా ఈ కేసులో విచారించి అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వీటిని కూడా చదవండి: బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందా..?