Advertisement
తెలుగు ఇండస్ట్రీలో జేజమ్మగా ఎంతో పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి తన యొక్క సాలిడ్ అందాలతో ఇప్పటికీ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.. నాలుగు పదుల వయస్సు దాటిన పెళ్లి ఊసు ఎత్తకుండా తన కెరియర్ లో దూసుకుపోతున్న అనుష్క శెట్టి పెళ్లిపై ఒక తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందని, ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా తెలంగాణకు చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Advertisement
also read: బాధ్యతలు స్వీకరించిన అలీ.. ఏమన్నారంటే..?
Advertisement
ఎట్టకేలకు అనుష్క శెట్టి పెళ్లి విషయం ఫైనల్ అయినట్టే కనిపిస్తోంది.. తనకు కాబోయే భర్త తెలంగాణకు చెందిన పెద్ద నగల వ్యాపారి అని సమాచారం.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది.. ఇక అనుష్కకు ఇప్పటికే ఎప్పుడో పెళ్లి కావాల్సింది కానీ అనుష్క ప్రభాస్ ప్రేమించు కుంటున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనేక పుకార్లు పుట్టాయి.. ఆ పుకార్లకు ఊతమిచ్చేలా అటు ప్రభాస్ మరియు అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.. వారిద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టే పెళ్లి చేసుకోలేదని కొంతమంది చేసే పుకార్లకు బలం వచ్చినట్టు అయింది. చివరికి వీరిద్దరూ మధ్య ప్రేమ లేదని ఫ్రెండ్షిప్ మాత్రమే అని వివరణ ఇచ్చుకున్నారు.
అయితే వివరణ ఇచ్చినప్పటికి మీడియాలో మాత్రం కథనాలు ఆగలేదు. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. సీరియల్ లా కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక తాజా విషయానికి వస్తే తెలంగాణకు చెందినటువంటి నగల వ్యాపారి సంబంధాన్ని అనుష్క కుటుంబం చూసిందట. ఇకపోతే అనుష్క వయసు మీద పడుతుండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలంటే అనుష్క స్పందించాల్సిందే..
also read:మునుగోడు ఎలెక్షన్ ఫలితాలు ! ‘COPACT’ సర్వే నిజం అయ్యింది