Advertisement
ఏపీ చరిత్రలో కని విని ఎరగని రీతిలో కృష్ణ, బుడమేరు వరదలు సంభవించాయి చాలామంది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల్లోనే అందరి సహకారంతో పరిస్థితుల్ని చక్కబెట్టారు. ఈ వరద వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్యాకేజీ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి అని ఈ ప్రాజెక్టు 11.09 లక్షల క్యూసెక్కుల వాటర్ డిస్చార్జ్ చేసే విధంగా రూపొందించడం జరిగిందని అన్నారు.
Advertisement
తొలి ఆనకట్టు 100 సంవత్సరాల ప్రస్తుత ప్రాజెక్టు 75 సంవత్సరాల కింద నిర్మించిన దాదాపు 175 ఏళ్ల పురాతనమైన ఈ ప్రాజెక్టులోకి ఒకేసారి 11.4 లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం భారీ విపత్తుకు కారణమైందని అన్నారు. వైసిపికి చెందినవారు బోట్లు ఒక్కోటి 40 మెట్రిక్ టన్నులు ఉండే మూడు బోట్లను కృష్ణా నదిలో వదిలిపెట్టడం వలన అవి వచ్చి నేరుగా కౌంటర్ వీటిని ఢీకొట్టే అనేది ఎంతో గేట్లు విరిగిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. మొదటి వరకు వాటికి రిపేర్లు చేయడంతో పాటుగా ఆ బోట్లను తీయడానికి ఎంత కష్టపడడం జరిగిందో అందరూ చూశామని అన్నారు.
Advertisement
Also read:
వంద రోజులు ఈనెల 20వ తేదీకి పూర్తవకముందే భారీ విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని అన్నారు. 32 వార్డుల్లోని 179 సచివాలయాల్లోని వరద బాధితులని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటుగా పాడైపోయిన గృహపకరణాల మరమ్మత్తుకి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగిన వాళ్లందరికీ 25 వేలు చొప్పున అధిక సహాయం అందజేస్తామని.. ఒక ఇంటికి 25,000 ఇవ్వడం అనేది చరిత్రలో ఇదే మొదటి సారి అని అన్నారు. రాయితీపై కూరగాయలు, 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ పప్పు, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళదుంపలు ఇచ్చామని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!