Advertisement
మాజీ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి రోజా అని ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోపిడీ చేశారని.. కేవలం ఎన్నికల స్టడీస్ కోసం ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినట్లు చెప్పారు.
Advertisement
రోజాని నిర్వహించిన ఆడుదాము ఆంధ్రాలో వేల కోట్లు చేతులు మారాయని.. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన చిన్నారులకి అవకాశం ఇచ్చినట్లు మండిపడ్డారు. క్రీడల్లో ప్రతీ పనీ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
Advertisement
Also read:
అలాగే నాయుడు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాలో వేల కోట్ల రూపాయలు చేతులు మారడం, రోజా తిరుమల దర్శనాలు ఈ రెండు అంశాల మీద సీఐడి విచారణ చేస్తామని చెప్పారు. తిన్న అవినీతి సొమ్ముని కక్కిస్తామని.. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే కచ్చితంగా రోజాను జైలుకు పంపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!