Advertisement
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగవసారి సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా లో తొలిసారి బీజేపీ తరఫున మోహన్ చరణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రాష్ట్రాల్లో సీఎంలు నెలకు ఎంత జీతం తీసుకుంటారు అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. ఇప్పుడు వాటి వివరాలను చూసేద్దాం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన జీతం ముఖ్యమంత్రులకి ఉండదు. వాళ్ళ పరిస్థితిలో స్థితిగతుల్ని బట్టి మారుతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి వేరువేరుగా వేతనాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రికి వాహనం భద్రత తో పాటుగా విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే విసులుబాటు కూడా ఉంటుంది.
Advertisement
Advertisement
అంతే కాదు మంచి జీతం కూడా ఇస్తారు. ఒడిశా ముఖ్యమంత్రికి దాదాపు 1.60 లక్షల జీతం ఇస్తారు. ఏపీలో చూసినట్లయితే ముఖ్యమంత్రి జీతం నెలకు 3,35,000 గా ఉంది దేశంలో అనేక రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వ విమానాలు హెలికాప్టర్లు కలిగి ఉన్నాయి. ముఖ్యమంత్రి గవర్నర్తో పాటు పలువురు మంత్రులు కూడా వీటిని ఉపయోగిస్తారు అత్యవసర పరిస్థితులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎవరికైనా ఉపయోగించుకోవడానికి ఇవ్వచ్చు ముఖ్యమంత్రి సమయాన్ని ఆదా చేయడానికి రహదారి రైల్వే మార్గాల గుండా ప్రయాణం చేయడం వలన భద్రతకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించడానికి తక్కువ దూర ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. రాష్ట్రం నుండి బయటకు వెళ్లడానికి విమానాలను వాడతారు. చాలా తక్కువ జీతం త్రిపుర ముఖ్యమంత్రి కి ఇస్తున్నారు.
Also read:
Also read:
త్రిపుర సీఎం దేశంలోనే అత్యల్ప జీతం పొందుతున్నారు. కేవలం 1.05 లక్షలు మాత్రమే వస్తాయి. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది ఇది కూడా కొత్త, చిన్న రాష్ట్రం. తెలంగాణ సీఎం దేశంలోనే అత్యధికంగా 4.10 లక్షల వేతనం నెలకి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక వేతనాలు తీసుకునే జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు రెండవ స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయన నెలకు 3.90 లక్షల తీసుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!