Advertisement
ఆపిల్ బ్రాండ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆపిల్ అందరికీ తెలుసు అది ఖరీదైనదని. అయితే చాలామందిలో వచ్చే సందేహం ఏమిటంటే ఆపిల్ లోగో సగం కొరికినట్లు ఉంటుంది. అయితే ఆపిల్ కంపెనీ కాబట్టి ఉంటే మొత్తం ఆపిల్ ఆకారం లోగో ఉండాలి.
Advertisement
కానీ ఇలా సగం కొరికినట్టు ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆపిల్ కంపెనీ లోగోలు ఆపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
అయితే మొదట్లో ఆపిల్ కంపెనీ లోగో న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నట్టు లోగో ఉండేది. అయితే ఆ లోగో స్టీవ్ జాబ్స్ కి నచ్చకపోవడంతో రాబ్ జానఫ్ అనే వ్యక్తి చేత ఈ లోగో చేయించాడు. అయితే ఈ లోగో సీవ్ జాబ్స్ కు విపరీతంగా నచ్చడంతో ఇక దీనినే యాపిల్ లోగో గా నిర్ణయించాడు. అయితే ఎందుకు ఆపిల్ లోగో ఇలా ఆపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే దానిపై రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
Advertisement
బైబిల్ యాడమ్ మరియు ఇవ్ లను దేవుడు ఏ పండు అయితే తినవద్దని చెబుతాడో అదే పండును తినడంతో ప్రపంచం మొత్తం మారిపోయిందని అందుకే వారికి గుర్తుగా ఇలా సగం కొరికిన ఆపిల్ ను లోగో గా ఏర్పాటు చేశారని ఒక ప్రచారం ఉంది. ఒక ఇంటర్వ్యూలో రాబ్ జానఫ్ లోగో పై వివరణ ఇచ్చారు. యాపిల్ అనేది చెర్రీ ఆకారాన్ని కూడా పోలి ఉంటుందని దీంతో చెర్రీ, ఆపిల్ ను గుర్తించడం కష్టమని అందుకే సగం కొరికినట్టు ఉండడం వల్ల సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి లోగోను ఏర్పాటు చేశామని తెలిపారు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?