Advertisement
సాధారణంగా పక్షులు ఆకాశంలోనే ఎగురుతూ చెట్లపై వాలుతూ ఎక్కువగా అడవిలోనే తిరుగుతాయి. కానీ కొన్ని పక్షులు మాత్రం నేలపై తిరుగుతూ ఉంటాయి. ఇక ఇండ్లలోకి కొన్ని పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని పక్షులు మన ఇండ్లలోకి వస్తే శుభం కలుగుతుంది.మరికొన్ని పక్షులు ఇంట్లోకి వస్తే అశుభం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో పిల్లి ఎదురుగా వస్తే మనం అపశకునంగా భావిస్తాం.
Advertisement
also read: రామ్ పోతినేనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?
కానీ కొన్ని సందర్భాల్లో పిల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అయితే మన ఇంటికి ఎలాంటి పక్షులు వస్తే శుభం కలుగుతుందో,ఎలాంటి పక్షులు వస్తే అశుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ఇంట్లోకి పిచ్చుకలు ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు అంటుంటారు. ఎందుకంటే పిచ్చుకలు ఇంట్లోకి రావడానికి శుభసూచకం గా భావించాలి. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే అది లక్ష్మీప్రదం. లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం.
Advertisement
also read:చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని.. ఇద్దరూ ఇద్దరే!
అదే రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే ఇంట్లో కళ్యాణం లేదంటే సంతానం కలగబోతుందని అర్థం. అలాగే పితృదేవతలకు ప్రతీకగా ఉండే కాకి ఎగురుతూ ఇంటి దగ్గరికి వస్తే మంచిది. మన ఇంటి పెద్దలు ఆశీర్వదించడానికి వచ్చారని భావించాలి. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతుంది అని అర్థం. అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం.
also read: కేసీఆర్ కు తెలిసిందల్లా మోసం చేయడమే!