Advertisement
సమంత, నాగచైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2021 అక్టోబర్ నెలలో విడిపోతున్నట్టు ఇరువురు ప్రకటించారు. మీరు విడాకులకు సంబంధించి ఇప్పటికి కూడా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆకస్మాత్తుగా తాము విడిపోతున్నామని ప్రకటించడంతో నాగచైతన్య, సమంత అభిమానులు అప్పట్లో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తాజాగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఇదే అని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
Advertisement
Advertisement
తాజా సమాచారం ప్రకారం, సమంతా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత, నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట. ఆ సమయంలోనే చైతన్యకి సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ హీరోయిన్ మరెవరో కాదండోయ్ శోభిత ధూళిపాల. ఈ విషయాన్ని సమంత సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట. దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత, నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
ఆ సమయంలో వీరిద్దరు మళ్ళీ కలుస్తారని వార్తలు వినిపించాయి. ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు చూడాలి మరి. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన వ్యాధి గురించి చెప్పిన సమంత, తనకు ఉన్న వ్యాధి గురించి తెలుసుకొని చాలామంది టాలీవుడ్ ప్రముఖులు సమంతను ఓదార్చారు. తన పరిస్థితిని తెలుసుకొని నాగచైతన్య కూడా చాలా టెన్షన్ పడ్డాడట.
READ ALSO : సుకుమార్ గారు మీ ప్లానింగ్ మాములుగా లేదు ! ఇలా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ?