Advertisement
ప్రస్తుత మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మానవులు అనేక రకాల ఫుడ్ ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం కోసం రాత్రి పూట అన్నం బదులు చపాతీలు, జొన్న రాగి రొట్టెలు తింటున్నారు. ఎక్కువగా కొందరు చపాతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నం బదులు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా, అసలు చపాతీలను ఎలా తింటే మంచిది. అనే వివరాలను తెలుసుకుందాం.
Advertisement
చపాతీలను తయారు చేసే గోధుమ పిండిలో విటమిన్ బి, ఇ, కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నం తినడం వల్ల శక్తి లభిస్తుందో చపాతీల వల్ల కూడా అంతే ఎనర్జీ లభిస్తుంది. కానీ అన్నం కంటే చపాతీ త్వరగా జీర్ణం అవుతుంది. చపాతీలను నూనె లేకుండా లేదంటే తక్కువ నూనె వేసి కాల్చడం వల్ల అన్నంలో పోల్చినప్పుడు కాస్త తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు, రెండు, మూడు చపాతీలు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతాం అంటున్నారు నిపుణులు.
Advertisement
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 7 గంటల లోపు చపాతీలను తినడం బెటర్ అంటున్నారు. చపాతీలు తినడం వల్ల కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. గోధుమల్లో అధికంగా ఉండే విటమిన్ ఇ, జుట్టును చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చపాతీలను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రిపూట భోజనంలో భాగంగా చపాతీలను తీసుకోవడం వల్ల బరువును తగ్గడంతో పాటు, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.