Advertisement
చాలామందికి విమానాల్లో ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే, మొదటిసారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా కొన్ని లక్షల్లో జరిమానా అక్కడితో ఆగకుండా జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే, విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
విమానంలో ప్రయాణించేటప్పుడు చాలా మంది సరదాగా సిబ్బందితో మేము మద్యం సేవించామంటూ మాట్లాడతారు. పొరపాటున కూడా వారితో ఇలా మాట్లాడటం వల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. మద్యం సేవించామని విమానయాన సిబ్బందితో చెప్పినప్పుడు వారు వెంటనే మీపై చర్యలు తీసుకుంటారు. మిమ్మల్ని తదుపరి ఎయిర్పోర్ట్ లో దించే అధికారం వారికి ఉంటుంది. అదేవిధంగా మీపై కేసు పెట్టి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే హక్కు ఉంటుంది.
కనుక పొరపాటులో కూడా మేము మత్తులో ఉన్నాము, మద్యం సేవించామని చెప్పకూడదు. అదేవిధంగా విమానంలో వారి పర్మిషన్ తీసుకొని మందు తాగవచ్చు. కానీ ముందుగా మందు తాగి విమానంలో ప్రయాణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల పూర్తిగా మిమ్మల్ని విమానంలో ప్రయాణం చేయడానికి అనర్హులుగా భావించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే విమానంలో ప్రయాణం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రయాణ నియమాలను తెలుసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది.
Read Aslo : అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?