Advertisement
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలల ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతాం. ఏదైనా విషయాన్ని మనకు దూరంగా ఉన్న బంధువులకు తెలియజేయాలంటే క్షణాల్లో తెలియజేస్తున్నాం. ఇవన్నీ టెక్నాలజీ మూలంగానే జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. అందులో వాట్సప్ యాప్ అనేది తప్పనిసరి అయిపోయింది. మనం ఉదయం లేచినప్పుడు మొదట చూసేది ఆండ్రాయిడ్ ఫోను, అందులోనీ వాట్సాప్. ఉదయం నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు చాలామంది ఈ వాట్సాప్ లోనే గడుపుతూ ఉంటారు.
Advertisement
ఈ యాప్ ను వాడే యూజర్లు కూడా పెరిగిపోవడంతో వాట్సప్ యాజమాన్యం ఎన్నో ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సరికొత్తగా ముందుకు పోతోంది. అయితే ఈ వాట్సప్ లో మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం, ఫోటోలు పంపించు కోవడం, స్టేటస్ లు పెట్టడం, వారి స్టేటస్ లు చూడటం తప్ప అందులో వచ్చిన ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. అయితే వాట్సాప్ యూపీఐ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. కరోణా సంక్షోభంలో యూపీఐ సేవలకు డిమాండ్ పెరగడంతో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువైపోయాయి. బ్యాంకు వెళ్లే పనిలేకుండా ఇంట్లో నుంచి బ్యాంకు సేవలను వినియోగించుకునే ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ తరుణంలోనే వాట్సాప్ కూడా యూపీఐ సేవలను తీసుకొచ్చింది.
Advertisement
కానీ దీని గురించి చాలామంది వాట్సాప్ యూజర్లకు తెలియదు. దీంతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవటానికి వాట్సప్ క్యాష్ బ్యాక్ అని ఆఫర్ ను కూడా తీసుకొచ్చింది. వాట్సాప్ యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మనం చేసే మొదటి మూడు లావాదేవీలకు 35 రూపాయల చొప్పున క్యాష్ బ్యాక్ ఇస్తోంది వాట్సాప్ యాజమాన్యం. మనం ఒక్క రూపాయి నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేసిన 35రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫోన్ పే మరియు గూగుల్ పే,పేటియం లాంటి యూపీఐ పేమెంట్ సేవలు అందించే యాప్ కు పోటీగా వాట్సప్ కూడా ఈ ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.
also read;
కంప్యూటర్ కీ బోర్డు లో అక్షరాలు ఎందుకు ఆర్డర్ లో ఉండవు ? వాటి అర్థం అదేనా ?