Advertisement
బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని తీసుకోవడం వలన ఎలాంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, ఫైబర్, యాంటీ ఒబిసిటీ అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది.
Advertisement
ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి సమస్య నుంచి బయటపడడానికి గుమ్మడికాయ చాలా హెల్ప్ చేస్తుంది. ఉత్సాహంగా ఉండేటట్టు చూస్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా ఇది తగ్గిస్తుంది.
Advertisement
Also read:
అజీర్తి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి మలబద్ధకం కూడా తగ్గుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే కూడా దీనిని తీసుకోవచ్చు. గుమ్మడి కాయకి తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసుకుని మిక్సర్ లో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత వడకట్టుకుని ఆ జ్యూస్ తాగితే చాలు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!