Advertisement
తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రొడ్యూసర్ అశ్విని దత్.. ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కు గెస్ట్ గా వచ్చిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు గడిచిందని, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశానని తెలిపారు.. అలాగే ఆయన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. తనకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా నాన్నగారు ఎలాగైనా ఇంజనీరింగ్ చదవాలని పట్టుబడ్డారు అని అన్నారు..
Advertisement
Also Read: హిట్ సినిమాలు చేతులారా.. మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే ?
Advertisement
దీంతో ఇంజనీరింగ్ చదువు కోసం హోస్సురు వెళ్లానని,అక్కడ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అనారోగ్యం బారిన పడి వెనక్కి తిరిగి వచ్చి బీఎస్సీ లో చేరానని సరదాగా ఆయనకు సంబందించిన విషయాలను బయటపెట్టారు.అశ్విని దత్ కు ముగ్గురు ఆడపిల్లలు స్వప్న,శేషు ప్రియాంక, స్రవంతిలు ఉన్నారు.. ఆయన ఇప్పటివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ మీదే కాకుండా అన్ని బ్యానర్స్ పై కలిపి సుమారు 70 సినిమాలు తీశానని, హిందీ,తమిళ్,కన్నడ ఇలా అనేక సినిమాలు తీశానని అన్నారు. రంగీలా సినిమాను తెలుగులో రజినీకాంత్, చిరంజీవి,శ్రీదేవి లతో తీయాలనుకున్నారా అని అడిగితే రాము నాకు రెండు కథలు చెప్పారు.
కానీ నేను రంగీలా సినిమా చేద్దామనుకున్నా.. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి, రజినీకాంత్ ల దగ్గరకు వెళ్లి గెస్ట్ రోల్స్ అంటే ఏమనుకుంటారో అని చెప్పి అలాగే ముక్కోణపు ప్రేమకథ ఎందుకు అని అనిపించి రంగీలా సినిమాను వదులుకున్నాను.ఇక రెండవది గోవిందా గోవిందా కథ.. ఇందులో వెంకటేశ్వర స్వామి గుడిలో దోపిడి అనే విధంగా కథ పెట్టి తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆ విధంగా నాకు గోవిందా గోవిందా సినిమా నచ్చేసింది.. అమీర్ ఖాన్ కి రంగీలా సినిమా వెళ్ళింది అంటూ తెలియజేసాడు అశ్వినీ దత్..
also read: మెగాస్టార్ అయినా ఏ స్టార్ అయిన మా నాన్న తర్వాతే అంటూ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!!