Advertisement
ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దాలు పగిలాయి. సోమవారం సాయంత్రం బర్రింకలపాడు గ్రామంలో ఇది చోటు చేసుకుంది ఎమ్మెల్యే వాహనం గ్రామంలో వెళ్తుంటే రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారని డ్రైవర్ కంప్లైంట్ చేయడంతో ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేశారు. ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఈ ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి పోలీసులు సన్నద్ధం అయ్యారు.
Advertisement
కారుపై రాయి పడడంతో వెనుకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు అయితే ఉన్నాయి. సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే కారులో డ్రైవర్ వ్యక్తిగత సహాయకులు వెళ్తున్నారు. బర్రింకలపాడు జంక్షన్ దగ్గర ఒక రాయి కారు వెనుక మిర్రర్ కి తగిలి కారు అద్దం పగిలిపోయింది ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.
Advertisement
Also read:
Also read:
ఘటన జరిగిన ప్రదేశంలో వసతి గృహం ఉందని అన్నారు ఆకతాయిలు విసిరారా లేదా ఎవరైనా ఉదేశపూర్వకంగా చేసారా లేదా అనేది విచారిస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఆయన వాహనంలో లేకపోవడం వలన హాని జరగలేదని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!