Advertisement
ఏ ఆటలో అయినా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఏం టాలెంట్ రా బాబు అంటూ పొగుడుతుంటారు.. గురువారం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆడిలైడు వేదికగా తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అష్టన్ అగర్ తన యొక్క సూపర్ ఫిల్డింగ్ తో అదరగొట్టేశారు. బౌండరీ లైన్ వద్ద సిక్సర్ వెళ్లాల్సిన బంతిని ఆపి అద్భుతాన్ని సృష్టించారు.
Advertisement
also read: కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. కమీన్స్ వేసిన 45 ఓవర్ ఆఖరి బంతిని డేవిడ్ మలన్ ఫుల్ షాట్ తో బాదాడు. వెంటనే గాల్లోకి లేచిన బంతి డీప్ స్క్వేర్ లేగ్ దిశలో సిక్సర్ వెళ్లేలా కనిపించింది. కానీ ఇంతలోనే ఆగర్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. వేగంగా దూసుకొచ్చిన బంతిని గాల్లోకి ఎగిరి మరీ ఒంటి చేత్తో అందుకున్నాడు. అప్పటికే ఈ ఆటగాడు బౌండరీ లైన్ పై గాల్లో ఉన్నాడు.
Advertisement
That's crazy!
Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
వెంటనే ఆ బంతిని బౌండరీ లైన్ అవతలకి విసిరేసి సిక్సర్ కాకుండా అడ్డుపడ్డాడు. ఈ ఘటన మొత్తం ఒక క్షణం కంటే తక్కువ సమయంలోనే జరగడం చాలా విశేషం. తన సమయస్ఫూర్తితో జట్టుకు ఏకంగా ఐదు పరుగులు సేవ్ చేశాడు ఆగరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. టాస్ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
also read: