Advertisement
క్రికెట్ ఫీల్డ్ లో గాయాలు చాలా కామన్ గా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాటర్ లకి ఫీల్డర్లకి ఇవి కామన్. బాల్ ని పట్టుకుపోయే ఫీల్డర్లు కిందకు పడిపోవడం లేదంటే ఒకరినొకరు ఢీకొని గాయాలు పాలవడం మనం చాలా సార్లు చూసాం బ్యాటర్ల సంగతి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పేస్ బౌలర్లు ఎదురైనప్పుడు వాళ్ళు ఎంతో టెక్నిక్ గా ఆడాలి. బాలు ఏమాత్రం మిస్ అయినా కూడా గాయాలు తప్పవు. ఒక రాకాసి బౌన్సర్ కి ఒక క్రికెట్ ప్రాణాలను కోల్పోయారు అతనే ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్. ఇక వివరాల్లోకి వెళితే వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడుతూ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే డొమెస్టిక్ మ్యాచ్లో ఆడుతూ బౌన్సర్ తలకి తగలడంతో క్రీజు లోనే చనిపోయారు క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఇది కుదుపువేసింది.
Advertisement
Advertisement
అటువంటి తరహాలో మరో కంగారు ఆటగాడు తాజాగా గాయపడ్డారు దీంతో మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్ ఉలిక్కిపడింది. బాల్ తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కి గాయాలు పాలయ్యారు అదృష్టవశాత్తు హాని జరగలేదు. ఇలా జరగడమా వలన దివంగత హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది బాల్ తలకి బలంగా తాకడంతో ప్రాణాలని హ్యూస్ కోల్పోయాడు. ఇప్పుడు అదే తరహాలో అదే టోర్నీలో ఇంచుమించు అటువంటి ఘటన చోటు చేసుకుంది. విల్ పుకోస్కి కి గాయం తీవ్రంగా తగిలింది. కానీ అతను మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగారు.
బాల్ విల్ పుకోస్కి హెల్మెట్ కి గట్టిగా తగిలింది దీంతో అతను క్రీజు లో కుప్పకూలిపోయాడు కొంతసేపు నొప్పితో విలవిలాడాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 72 పరుగులు చేశాడు ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది ఆదివారం నాటి ఘటన చూస్తే.. టోర్నీలో భాగంగా టస్మానియా టైగర్స్ విక్టోరియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో తస్మానియా 57 పరుగుల తేడాతో గెలిచింది విసిరిన 442 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్టోరియా జట్టు 384 పరుగులు చేసి ఆలౌట్ అయింది గాయం తగిలిన తర్వాత విల్ పుకోస్కి మళ్ళీ బ్యాటింగ్ కి రాలేదు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!