Advertisement
మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సినీ ప్రియుల ముందుకు వచ్చేసింది అవతార్ 2. ముంబైలో వేసిన ప్రీమియర్ షో తో సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలయ్యింది. అయితే, అచ్చం అవతార్ సినిమాకు తీసిపోని కథ ఒకటి ఇండియాలోనూ జరిగింది. దాని వివరాలు లోకి వెళితే, ఒరిస్సా లోని రాయగడ-రాయగడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నియాంగిరి అనే ఫారెస్ట్ రేంజ్ ఉంది. ఈ ప్రాంతంలో డోంగ్రియా కొందు అనే అటవీక జాతి నివసిస్తోంది. ఈ జాతికి తమ భూమి అన్ని. కొండ దేవతను నమ్ముకొని కొన్ని వందల ఏళ్లుగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లో తిన్నారు. లేకపోతే అందులోను సంతోషాన్ని వెతుక్కుని పస్తులున్నారు. ఏనాడు అడవిని విడిచి వెళ్లిపోవాలని వారు అనుకోలేదు. అలాంటి వారి జీవితాల్లోకి వేదాంత అనే కంపెనీ ప్రవేశించింది.
Advertisement
డోంగ్రియా కొందు జాతి ఉంటున్న అటవీ ప్రాంతంలో విలువైన బాక్సైట్ గనులు ఉన్నాయి. దాని ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జించవచ్చని కంపెనీ భావించింది. ఈ మేరకు ఏకంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. 2003లో అక్కడ మైనింగ్ కు అనుమతులు వచ్చేలా జిమ్మిక్కులు చేసింది. చివరకు ఎలాగైతేనే మైనింగ్ అనుమతులు వచ్చేసాయి. కంపెనీ లాంచిగడ్ లో రెండు వేల ఎకరాల స్థలంలో అల్యూమినియం శుద్ధి కంపెనీని కట్టించింది. నియాంగిరి కొండల్లో తవ్వకాలు జరపటమే తరువాయి. ఇలాంటి సమయంలో అసలు కథ మొదలైంది. ప్రజా సంఘాల హీరోగా ఆదివాసీల పోరాటం. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, రక్తపాతం లేదు కానీ, తమ జన్మభూమి కోసం డోంగ్రియా కొందు జాతి చేసిన పోరాటం తక్కువదేమీ కాదు. తమకున్న ఒక్కగానోక్క ఆస్తిని కాపాడుకోవడానికి ఆ జాతి గట్టిగానే పోరాడింది. వీరికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. వారిని అన్ని విధాల తయారు చేసి ముందుకు నడిపించాయి. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించాయి. దీంతో తవ్వకాలపై స్టే వచ్చింది. అయినా వేదాంత అంతటితో ఆగలేదు. పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయమని, స్థానికులను ఆదుకుంటామని చెప్పి స్టేను తొలగించే విధంగా చేసుకుంది. సుప్రీంకోర్టు కొన్ని షరతుల మీద అక్కడ తవ్వకాలు జరపటానికి ఇప్పటినుంచే కథా రసవత్తరంగా మారింది. ఇలా అయితే, తమ భూమి తమకు దక్కదని భావించిన ఆదివాసీలు ఉద్యమానికి తెరతీశారు. ‘నియాంగిరి సురక్ష సమితి’ ని ఏర్పాటు చేశారు. నిరసనలు, ధర్నాలు, ఇలా చాలా కష్టాలు పడ్డారు.
Advertisement
ఆ పోరాటంలో గూండాలు దెబ్బలు కూడా తిన్నారు. ఫ్యాక్టరీ కారణంగా జరుగుతున్న ఘోరాన్ని ప్రపంచం కళ్ళకు కట్టారు. దీంతో వేదాంత కంపెనీలో షేర్లు పెట్టిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు తమ వాటాలను వెనక్కు తీసుకున్నాయి. దీంతో కేంద్రం ఆలోచనలో పడింది. దీనిపై 2010లో ఓ కమిటీని వేసింది. కమిటీ జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాలకు పైగా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2013 ఏప్రిల్ 18 తుది తీర్పు వచ్చింది. నియాంగిరి పై మైనింగ్ కు అనుమతి ఇచ్చే అధికారం స్థానికులకే ఉందని కోర్టు పేర్కొంది. అయితే, స్థానికులను కూడగట్టి మళ్లీ మైనింగ్ చేయడానికి వేదాంత కంపెనీ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇక అవతార్ సినిమా 2009లో రాగా, ఈ పోరాట 2003లో మొదలైంది. ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. కాబట్టి, జేమ్స్ కామెరున్ ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అవతార్ స్టోరీ తయారు చేసుకున్నాడన్న ప్రచారం ఉంది.
Read also: ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?