Advertisement
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన బేబీ సినిమా జూలై 14న రిలీజ్ అయింది. బేబీ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ తో పాటుగా విరాజ్ అశ్విన్ కూడా మరో హీరో పాత్రలో నటించారు. ప్రస్తుతం బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా నుండి థియేటర్ స్క్రీన్ వరకు టాలెంట్ తో వైష్ణవి చైతన్య జర్నీను చూసి అందరూ అభినందిస్తున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే ఆమె స్నేహితురాలిగా ఒక అమ్మాయి నటించింది. ఆమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. మరి బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య పక్కన స్నేహితురాలుగా నటించిన ఆమె ఎవరు..? ఆమె వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వైష్ణవి చైతన్య స్నేహితురాలుగా నటించిన ఆమె పేరు కుసుమ డేగలమర్రి. ఈమె ఇండస్ట్రీకి కొత్త కావచ్చు కానీ యూట్యూబ్ కి కాదు. ఈమె అందరికీ పరిచయమే. కుసుమ కూడా సోషల్ మీడియా ద్వారా సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటోంది.
Advertisement
హీరోయిన్ లాగే వుంది ఈమె కూడా. ఇది చూసి అందరూ ఈమె కూడా మంచి స్టార్ అవుతుందని అంటున్నారు. ఈమె బిగ్ బాస్ స్పూఫ్ అనే వీడియోలో కనపడి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం కుసుమ డేగలమర్రి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె లేటెస్ట్ ఫోటోస్ చూసిన ఫాన్స్ రకరకాలుగా కామెంట్లు చూస్తున్నారు. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కి వైష్ణవి చైతన్య కి మంచి హిట్ ని ఇచ్చింది వైష్ణవి చైతన్య ఈ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. మరిన్ని అవకాశాలు వైష్ణవి చైతన్య కి వస్తాయని పెద్ద హీరోయిన్ అయిపోతుందని అంతా అంటున్నారు.
Also read: