Advertisement
టెర్రరిస్టులకు అడ్డాగా మారిన పాకిస్థాన్ భారత దేశానికి దాయాది దేశం అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య గడ్డి పోచ వేస్తె భగ్గుమన్నట్లు ఉంటుంది. ఇంకా అంతర్జాతీయ వేదికలపై కలిసినప్పుడు కూడా పాకిస్థాన్ ఇండియా పై బురద చల్లడానికి ప్రయత్నించి తనకు తానె భంగపడుతూ ఉంటుంది. అలంటి సంఘటనే ఒకటి రీసెంట్ గా చోటు చేసుకుంది. ఇటీవలి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సెషన్‌లో, పాకిస్తాన్ మరోసారి భారతదేశంపై ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ సిద్ధం ఐంది.
Advertisement
ఇవి కూడా చదవండి: రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త తలనొప్పి ! ఇది కదయ్యా అభిమానం అంటే !
ఇవి కూడా చదవండి: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలతో గొడవ పడ్డ వైయస్ రాజశేఖర్ రెడ్డి !
పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. భారత దేశం మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోంది అంటూ దుమ్మెత్తే ప్రయత్నం చేస్తారు. అయితే.. ఆయన మాటలకు ధీటుగా సమాధానం ఇచ్చింది భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన యువ మహిళా దౌత్య వేత్త పెటల్ గహ్లోట్. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ కు అందరిముందు గట్టిగానే సమాధానం ఇచ్చింది. అసలు టెర్రరిస్ట్ లకు అడ్డా మీ గడ్డ.. ముంబై దాడులకు పాల్పడ్డ నిందితులకు మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? అంటూ సూటిగానే ప్రశ్నించింది. మా కాశ్మిర్ ను ఆక్రమించింది చాలదు అన్నట్లు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ అందరిముందు కడిగిపారేసింది. అంతర్జాతీయ వేదికల మీద ఇంత స్పష్టంగా ఎప్పుడు ఈ విషయాన్నీ ఎవరు ప్రస్తావించలేదు.
Advertisement
ఇవి కూడా చదవండి:పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద పరీక్ష ! ఇది నిజంగా ఒక పెద్ద సమస్యే !
డైరెక్ట్ గా అందరిముందే ఆమె కడిగిపారేసారికి పాక్ తాత్కాలిక ప్రధాని షాక్ అయ్యారు. దీనితో ఆమె పేరు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈమె గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించింది, అక్కడ ఆమె పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందింది. సబ్జెక్ట్ పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీకి తీసుకెళ్లింది, అక్కడ ఆమె పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. 2015లో, పెటల్ గహ్లోట్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)లో తన కెరీర్ ని ప్రారంభించింది. ఆమె గతంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని యూరోపియన్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేసారు. ఇంకా, ఆమె పారిస్ మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ మిషన్/కాన్సులేట్‌లో పనిచేశారు. కెరీర్ విషయాలు పక్కన పెడితే, ఆమె మంచి గిటార్ ప్లేయర్ కూడా. ఆమెకు “గిటార్ డిప్లొమాట్” అనే బిరుదు కూడా ఉంది. ఆమె మంచి గాయని కూడా. ఫారిన్ సాంగ్స్ ను చాలా బాగా పాడతారు అన్న పేరు కూడా గహ్లట్ కు ఉంది.