Advertisement
Balagam Movie Review: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన చిత్రం బలగం. ఈ చిత్రంలో హీరోగా కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు అలాగే కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో లీడ్ పెయిర్. బీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
Advertisement
ఈ సినిమా కథ చనిపోయిన తర్వాత కాకులకు పిండం పెట్టడం నేపథ్యంలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, యాస, గోస కట్టుబాట్లు.. ఇలా సమస్తం ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో పెద్ద తారలు లేకపోయినా ఈ సినిమాకి తగిన స్థాయిలో ప్రచారం లభించిందంటే దిల్ రాజు వెనుక ఉండడమే కారణం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఇంతకీ బలగం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also: మన టాలీవుడ్ తారలు.. వారి మధ్య ఉన్న బంధుత్వాలు
Balaam Movie Story in Telugu: కథ మరియు వివరణ:
బలగం కథ మొత్తం తెలంగాణలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఓ పల్లెటూరులో కొమురయ్య (సుధాకర్ రెడ్డి) కి తన ఊరు, పొలం అంటే చాలా ఇష్టం. కొమురయ్య గ్రామంలో అందరితోనూ కలివిడిగా ఉంటాడు. అతనికి దారిన పోయే ప్రతి ఒక్కరిని పలకరిస్తే గాని పొద్దుపోదు. తెల్లవారుజామునే పొలానికి వెళుతూ అందరినీ నిద్ర లేపుతూ వెళ్లి వస్తుంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొమురయ్య పెద్ద కుమారుని కొడుకు, మనవడు సాయిలు (ప్రియదర్శి) 15 లక్షల అప్పు చేస్తాడు.
పెళ్లి చేసుకొని వచ్చిన కట్నం డబ్బులతో ఆ అప్పులు తీసేయాలని అనుకుంటాడు. నిశ్చితార్దానికి అంతా సిద్ధమవుతోంది. కానీ ఆ సమయంలో ఆకస్మాత్తుగా కొమురయ్య చనిపోతాడు. దాంతో ఆ పెళ్లి ఆగిపోతోంది. ఇక కొమరయ్య అంతిమ సంస్కారాలకు వారి బంధుగణమంతా వస్తుంది. పాతికేళ్ల క్రితం గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయిన కొమురయ్య కూతురు, అల్లుడు కూడా వస్తారు. అలాగే సూరత్ లో ఉన్న కొమురయ్య చిన్న కొడుకు, కోడలు కూడా తండ్రి పోయాడు అనగానే వచ్చేస్తారు.
కొమురయ్య కొడుక్కి, అల్లుడికి క్షణం పడదు. చావు ఇంట్లోనే ఇగోలు మొదలవుతాయి. అయితే కొమురయ్య పిండం ముట్టుకోవడానికి ఒక్క కాకి వాలదు. అలా వాలకపోతే ఊరికి అరిష్టం పట్టుకుంటుందని పెద్దలు భావిస్తారు. దీంతో గ్రామ పెద్దలు కొమురయ్యకి తీరని కోర్కెలు ఏమైనా ఉన్నాయా అని అడిగి అవి తీరిస్తే కాకి వచ్చి ముట్టుకుంటుందని ఇంటి సభ్యులకి చెబుతారు. అయితే కాకి వచ్చి పిండం తినడానికి ఆ కుటుంబం చివరికి ఏం చేసింది అన్నదే బలగం కథ.
Advertisement
బలగం అంటే మనం సంపాదించుకునేది కాదు, మన కుటుంబమే మన బలగం అని చాటి చెప్పే ప్రయత్నం ఈ సినిమా. తెలంగాణలో ఓ చావు చుట్టూ జరిగే సన్నివేశాన్ని పక్కాగా ఆవిష్కరిస్తూనే, ఓ కుటుంబంలోని సంఘర్షణని అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఓ కమెడియన్ నుంచి కామెడీ సినిమా వస్తుందని అనుకుంటే.. హెవీ ఎమోషనల్ డ్రామా చూపించాడు వేణు.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బలంగా పండాయి. చిన్నప్పుడు చెల్లెలు తప్పిపోతే అన్నయ్యలు ఎంత గాభరాపడ్డారో చెప్పిన సీన్ గుండెల్ని పిండేస్తుంది. అలాగే తాతయ్యను తలుచుకుంటూ సాయిలు ( ప్రియదర్శి) రియలైజ్ అయ్యే సీన్ మరో హైలెట్.
ఇక క్లైమాక్స్ చూస్తే వేణు ని ఇన్నాళ్లు చూసిన కోణం పూర్తిగా మారిపోతుంది. తెలంగాణ సంస్కృతిలోని కీలకమైన జానపదాలని, ఒగ్గు కథల్ని ఈ సినిమాలో వాడిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథ మొత్తం ఓ ఇల్లు, చావు చుట్టూనే సాగడంతో అక్కడక్కడా సాగతీతగా అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త వారు నటించారు. ఇక ప్రియదర్శి కి ఇది ఒక మంచి పాత్ర. చాలా చక్కగా ఆ పాత్రలో ఇమిడిపోయాడు. అలాగే కావ్య కళ్యాణ్ రామ్ కూడా మరదలుగా చాలా బాగా నటించింది. సుధాకర్ రెడ్డి కొమురయ్యగా కొన్ని నిమిషాల పాటు కనిపించినా.. సినిమా అంతా ఉన్నట్టే ఉంటాడు. ఇక భీమ్స్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమాకి ఒక మూలస్తంభం.
ఇక కాసర్ల శ్యాం పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాట కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇక చిత్రంలో చివరగా కుటుంబమే తన బలం, బలగం అవుతుంది. ఇదే విషయాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
కథా నేపథ్యం
పాటలు
హాస్యం, భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్ :
సాగదీతగా కొన్ని సన్నివేశాలు
ప్రేక్షకుడి ఊహకు అందే కథ
Balagam Movie Review in Teluguరేటింగ్: 2.75/5
Read also: దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !