Advertisement
Nandamuri Balakrishna Dialogues Telugu:నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వింటే ఆయన అభిమానులకు పూనకాలు వస్తాయి. ఇక బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ లకు థియేటర్లు దద్దరిల్లుతాయి. ఈలలతో మారుమ్రోగిపోవాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలోనే డైలాగ్ లు అంటే గుర్తుకొచ్చేది బాలయ్యనే. ఎన్నేళ్లు గడిచినా ఆయన సినిమాలలో మరిచిపోలేని డైలాగులు చాలానే ఉన్నాయి.రైటర్స్, దర్శకులు బాలయ్యను దృష్టిలో పెట్టుకొని మరీ ప్రత్యేకంగా డైలాగులను రాస్తుంటారు. బాలకృష్ణ నటించిన ప్రతీ సినిమాలో ఏదో ఒక డైలాగ్ దాదాపు పాపులర్ అయితీరుతుంది. ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం అయితే డైలాగ్ తోనే థియేటర్లు దద్దరిల్లాయి. బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన కొన్ని Balakrishna Dialogues Telugu డైలాగ్ లు ఇప్పుడు మనం విందాం.
Advertisement
- నేను ఇక్కడ తొడ కొడితే నువ్వు అక్కడ గుండె ఆగి చస్తావ్. సమరసింహారెడ్డి.
- కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..! నరసింహా నాయుడు
- కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఈ సారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చే వాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నాకు పేరు లక్ష్మీనరసింహాస్వామి అని. లక్ష్మీనరసింహా
- రౌడీయిజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ జోలికి వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది.. బతుకు డ్రైనేజీ అవుద్ది. వీరభద్ర
- ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు.. లెజెండ్
- రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ – లెజెండ్
- ఒకమాట నువ్వు అంటే అది శబ్ధం, అదే మాట నేనంటే.. శాసనం, దైవ శాసనం – అఖండ.
- నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే షూటర్ ని కాల్చి పారేస్తా – లెజెండ్
- ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా — లెజెండ్.
- ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు – సమరసింహారెడ్డి
- ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ.. చరిత్రంటే మాదే.. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయలన్నా మేమే. – సింహా
Advertisement
- భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తుంది. నువ్వు మారకపోతే మళ్లీ చచ్చాక వినపడుతుంది. ఇప్పుడే వింటావా ? చచ్చాక వింటావా ? లయన్
- సరిహద్దులోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండాల మీద మా జెండాలు ఎగురేస్తాం- గౌతమి పుత్ర శాతకర్ణి.
- దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం – గౌతమిపుత్ర శాతకర్ణి
- నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది- లెజెండ్
- నీకు బీపీ వస్తే నీ పీఏ ఒనుకుతాడేమో.. కానీ నాకు బీపీ వస్తే ఏపీ వనుకుద్ది – లెజెండ్
- నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపునా పుట్టడానికి మాత్రం కూతురు వద్దు.- లెజెండ్
- ఊరు మారితే పడుకునే బెడ్ మారుద్ది. తినే ఫుడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్ది రా బ్లడి ఫూల్ – లెజెండ్ ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పారదొబ్బుతా – అఖండ
Powerful Balakrishna Dialogues and Dialogues Lyrics in Telugu
- నా మాట పదును.. నా కత్తి పదును.. నీ పక్కోడికి తెలుసు.. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకళ్ళరా.. వీరసింహారెడ్డి.
- సీమలో ఏ ఒక్కరూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టాను. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్ ” వీరసింహారెడ్డి”.
- అపాయింట్ మెంట్ లేకుండా వస్తే.. అకేషన్స్ చూడను.. వెకేషన్స్ చూడను. ఒంటి చేతితో ఊచకోత.. కోస్తా నా కొడకా..
- సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు.
- పదవీ చూసుకొని నీకు పొగరు ఏమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువా..!
- మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా.. నాకు సవాల్ విసరకు, నేను శవాలు విసురుతా..!
- నిన్ను తాకాలంటే కత్తి వణుకుద్దేమో.. నేను బరిలోకి దిగితే సీమే వణుకుద్ది.
- రాకరాక వచ్చిన మంత్రి పదవీ.. నా చేత అడ్డమైన ఫైల్స్ మీద సంతకాలు చేయిస్తుండారు..రేపు ఏదైనా తేడా వచ్చిందనుకో.. పక్కా రాష్ట్రంలో ఉన్నా ఎత్తుకొచ్చి మరి కొడుతారురా..
- ఆడితల తీసుకురమ్మంటే.. తలకాయ కూర తింటవా.. పగోడి సావు కన్నా అన్నం ఎక్కువా నీకు..?
- పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకాతానంటే ముత్తైదవులా లేను ముండమోపిలా ఉన్నా..
- కాపు కాసిన కర్నూలోళ్లు, చుట్టుముట్టిన చిత్తూరోళ్లు, కమ్ముకొస్తున్న కడపోళ్లు, కత్తి కట్టిన అనంతపురమొళ్ళు ఎగెసికొస్తున్నారు.. సిద్దప్ప ఎండ నడినెత్తికెక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎర వేసి పోదాం.. రేయ్.. ఊరికి మంచి చేస్తే తలవంచుతా.. చెడు తలిస్తే ఎన్ని తలలైనా తెంచుతా..!
- వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలోడ్.. పదవీ చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్టీఏకి పొగరు ఎక్కువ.
- శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసయడమే నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా.
- మగతనం గురించి నువ్వు మాట్లాడు.. మొలతాల్లు సిగ్గు పడతాయ్..! ఈ గడ్డ మీద ఆడపడచు కోసం ప్రాణం ఇచ్చేవాడిని మగాడు అంటుంటారు. ఆడదానిని అడ్డుపెట్టుకొని బ్రతికే వాడిని కొ*జ్జా అంటారురా.. ముండమోపి..
- నా తండ్రి చితి సాక్షిగా చెబుతున్నా.. ఈ మట్టిమీద నా నెత్తురు బొట్టు పడే లోపు నీ తల తెగిపడకపోతే నేను సీమబిడ్డనే కాదురా..!
Also Read: Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!