Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు బాలకృష్ణ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై ఒకసారి కనిపిస్తేనే ఆయన అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఇక డబుల్ రోల్స్ లో కనిపిస్తే సిట్యుయేషన్ చెప్పక్కర్లేదు. అలా బాలయ్య బాబు డ్యూయల్ రోల్స్ లో చితక్కొట్టేసిన సినిమాల లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.
Advertisement
1. అపూర్వ సహోదరుడు (1986) – రాము & అరుణ్
1986లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “అపూర్వ సహోదరుడు”లో బాలకృష్ణ రాముడు, అరుణ్ పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. చిన్న వయసులో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో తిరిగి కలుసుకునే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.
2. రాముడు భీముడు (1988) – రాముడు & భీముడు
కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన “రాముడు భీముడు” రాముడు మరియు భీముడు పాత్రలలో బాలకృష్ణ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలు ఇద్దరు సోదరులు ఎదుర్కొన్న కష్టాలు, పరీక్షలకు సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరి క్యారెక్టర్లు వేరువేరుగా ఉంటాయి. వాటిల్లో బాలయ్యబాబు అవలీలగా జీవించారు.
3. బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) – సత్య హరిశ్చంద్ర & దుష్యంతుడు
1991లో ఎన్‌టిఆర్ దర్శకత్వం వహించిన “బ్రహ్మర్షి విశ్వామిత్ర” చిత్రంలో బాలకృష్ణ సత్య హరిశ్చంద్ర మరియు దుష్యంతుడు పాత్రలను పోషించారు. ఈ పౌరాణిక నాటకం పురాణ రాజు హరిశ్చంద్ర మరియు వివిధ సవాళ్లను ఎదుర్కొన్న తీరు గురించి చెబుతుంది.
4. ఆదిత్య 369 (1991) – శ్రీ కృష్ణదేవరాయ & కృష్ణ కుమార్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “ఆదిత్య 369″లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు మరియు కృష్ణకుమార్ పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందింది.
5. అఖండ:
ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపిస్తారు. ఒక పాత్ర మాములు వ్యక్తిగా ఉంటె.. మరో పాత్రలో అఘోరాగా కనిపిస్తారు.
6. సింహ:
ఈ సినిమాలో కూడా బాలకృష్ణ తండ్రిగా, కొడుకుగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు.
7. పెద్దన్నయ్య (1997) – రామ కృష్ణ ప్రసాద్ & భవానీ ప్రసాద్
Advertisement
1997లో శరత్ దర్శకత్వం వహించిన “పెద్దన్నయ్య” చిత్రంలో రామకృష్ణ ప్రసాద్ మరియు భవానీ ప్రసాద్ పాత్రలను బాలకృష్ణ పోషించారు. విడిపోయిన ఇద్దరు సోదరుల జీవితాల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది మరియు వారిద్దరూ ఏ పరిస్థితిలో కలుసుకున్నారు అన్నది ఈ సినిమాలో చూపించారు.
8. సుల్తాన్ (1999) – సుల్తాన్ & పృథ్వీ
శరత్ దర్శకత్వం వహించిన “సుల్తాన్” చిత్రంలో బాలకృష్ణ సుల్తాన్ మరియు పృథ్వీ పాత్రలలో నటించారు.
9. చెన్నకేశవ రెడ్డి (2002) – చెన్నకేశవ రెడ్డి & భరత్
వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన “చెన్నకేశవ రెడ్డి”సినిమాలో చెన్నకేశవ రెడ్డి మరియు భరత్ పాత్రలలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా కనిపించి మెప్పించారు.
10. అల్లరి పిడుగు (2005) – ACP రంజిత్ & గిరి
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన “అల్లరి పిడుగు”లో బాలకృష్ణ ACP రంజిత్ మరియు గిరి పాత్రలలో కనిపించారు. అవినీతి రాజకీయ నాయకులను ఎదుర్కొనే పోలీసు అధికారి ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
11. ఒక్క మగాడు (2008) – రఘుపతి రాఘవ రాజారాం & వీర వెంకట సత్యనారాయణ స్వామి
2008లో వై.వి.ఎస్ దర్శకత్వంలో వచ్చిన “ఒక్క మగాడు” సినిమాలో రఘుపతి రాఘవ రాజారాం & వీర వెంకట సత్యనారాయణ స్వామి పాత్రలలో బాలకృష్ణ నటించారు.
12. పాండురంగడు (2008) – శ్రీకృష్ణుడు & పాండురంగ
కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “పాండురంగడు” బాలకృష్ణ శ్రీకృష్ణుని పాత్రను మరియు పాండురంగ పాత్రను పోషించారు.
13. పరమ వీర చక్ర (2011) – మేజర్ జయసింహ & చక్రధర్
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “పరమ వీర చక్ర”లో బాలకృష్ణ మేజర్ జయసింహ మరియు చక్రధర్ పాత్రలలో కనిపించారు.
14. వీర సింహారెడ్డి
ఈ సినిమాకు గోపిచంద్ మలినేని రచన, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించారు.
మరిన్ని..
ప్రపంచ మొట్ట మొదటి ఏటీఎం గురించి ఈ విషయాలు తెలుసా?
విజయ్ మాల్యా తండ్రి విట్టల్ మాల్యా గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు? అస్సలు ఊహించి ఉండరు!
మంత్రి కేటీఆర్ కారుని చెక్ చేసిన పోలీస్ అధికారులు.. అందులో ఏమున్నాయంటే?