Advertisement
నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీసాయి. ఈ సక్సెస్ మీట్ లో దాదాపు అరగంటకు పైగా మాట్లాడిన బాలకృష్ణ మూవీ షూటింగ్ సమయంలో నటుల మధ్య ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయో చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారని చెబుతూ.. “ఈయన ఎప్పుడూ శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు ఈ “అక్కినేని.. తొక్కినేని” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవళ్లు నాగచైతన్య, అఖిల్ కూడా స్పందించారు.
Advertisement
Read also: సెలెక్టర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. స్లిమ్ గా ఉన్నవారే కావాలనుకుంటే ఫ్యాషన్ షో కి వెళ్లాలంటూ..
వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేశారు. అయితే.. హిందూపురంలో ఎమ్మెల్యేగా గురువారం పలు కార్యక్రమాలకు హాజరైన బాలకృష్ణ “అక్కినేని తొక్కినేని” వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇలా ఆ వివాదానికి ముగింపు పలకబోతు.. మరో కొత్త వివాదానికి తెరలేపారు. అక్కినేని నాగేశ్వరరావు ని కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని అన్నారు. సక్సెస్ మీట్ లో యాదృచ్ఛికంగా ఆ మాట వచ్చిందన్నారు బాలకృష్ణ. ” నాగేశ్వరరావు గారికి నేనంటే చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునేవారు. అలానే ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు. ఇక్కడ ఉంది.
Advertisement
గుర్తుపెట్టుకోండి” అని బాలకృష్ణ చెప్పుకుచ్చారు. దాంతో బాలయ్య ఇన్ డైరెక్ట్ గా అక్కినేని నాగార్జునని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి అక్కినేని నాగార్జున, బాలకృష్ణ మధ్య సుదీర్ఘకాలంగా కోల్డ్ వార్ నడుస్తుందని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ చేసిన “అక్కినేని తొక్కినేని” వ్యాఖ్యలపై కూడా నాగార్జున ఎక్కడ స్పందించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ “అక్కడ ఆప్యాయత లేదు.. ఇక్కడుంది” అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై నాగార్జున స్పందించాలని అక్కినేని అభిమానులు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. మరి ఈ వివాదం పై నాగార్జున స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Read also: పెళ్ళైన వారానికే నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు !