Advertisement
దర్శకులు హీరోల దగ్గరికి వెళ్లి కథ చెప్తూ ఉంటారు. వాళ్లకి నచ్చితే ఆ కథని ఒప్పుకుని ప్రొసీడ్ అవుతారు హీరోలు. కానీ ఒక్కొక్కసారి కథ నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గురించి చెప్పుకోవాల్సిందే. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత చాలామంది మెగా హీరోలని పరిచయం చేశారు. దాదాపు 40 ఏళ్ల పాటు చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీగా చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నారు.
Advertisement
ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బి గోపాల్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఆయనకి రౌడీ ఇన్స్పెక్టర్ కథ చెప్పారట చిరంజీవి అప్పుడు కొంచెం బిజీగా ఉన్నారట. దాంతో సినిమా చేయలేనని చెప్పేసారట ఈ కథని బి గోపాల్ బాలయ్య బాబుకి చెప్పారు బాలయ్య కథ నచ్చి ఓకే చెప్పారు సో బాలయ్య ఆ సినిమాలో నటించి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నారు. చిరంజీవికి రావలసిన బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య కి పడింది ఈ సినిమా చూసిన చాలామంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాకి బాలయ్య బాబు సరిగ్గా సరిపోయారు అనుకున్నారు.
Advertisement
ఆ సినిమాలో బాలయ్య పాత్ర కానీ బాలయ్య నటన కానీ చాలా బాగుందని మెచ్చుకున్నారు ప్రేక్షకులు. చిరంజీవి బి గోపాల్ కాంబోలో ఈ సినిమా మిస్ అయినా కూడా తర్వాత ఇంద్ర వంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని చిరంజీవి కొట్టేశారు ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు కూడా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చూస్తున్నారు. చిరంజీవి చేయాల్సిన సినిమాతో బాలయ్య బాబు మంచి హిట్ కొట్టేసారని తెలియడంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. బాలయ్య బాబు కూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు అదిరిపోయే హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్నారు బాలయ్య. బాలయ్య కూడా సీనియర్ హీరో అయినప్పటికీ హీరోలకి గట్టి పోటీ ని ఇస్తున్నారు ఇప్పుడు కూడా అదే జోష్ తో హిట్ ని అందుకుంటున్నారు బాలయ్య. మరి రానున్న రోజుల్లో బాలయ్య ఎటువంటి సినిమాలు చేస్తారు ఎలా హిట్ అందుకుంటారు అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!