Advertisement
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరో నియోజకవర్గం నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనునారా? బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ కూడా..చెన్నూరు నియోజకవర్గంపై ఎందుకు ఫోకస్ తగ్గించేశారు? ప్రస్తుత ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో విబేధాలు తలెత్తాయా? చెన్నూరు వైపు బాల్క సుమన్ కన్నెత్తి చూడకపోవడంతో గత కొద్ది రోజులుగా ఈ అంశాల చుట్టూ జోరుగా చర్చ జరుగుతోంది.
Advertisement
2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన సుమన్ కు..2018లో నల్లాల ఓదెలును కాదని మరీ కేసీఆర్ సీటు ఇచ్చారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేటీఆర్ కోటరీలో కీలక నేతగా ఎదిగిన సుమన్ చెన్నూరు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. అదే సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇక, 2023ఎన్నికల్లో వివేక్ చేతిలో ఓటమి పాలైన బాల్క సుమన్ అప్పటి నుంచి పెద్దగా నియోజకవర్గం వైపు దృష్టి పెట్టడం లేదు. అడపాదడపా నిరసన కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు తప్పితే క్యాడర్ ఆశించిన స్థాయిలో ఆయన పాలిటిక్స్ లేవని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మంచిర్యాల జిల్లాలో బడా నేతలను కాదని, యువకుడు అని బాల్క సుమన్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా..పార్టీ బలోపేతం కోసం కూడా చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఉన్నాయి.
Advertisement
అయితే, బాల్క సుమన్ పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే ఇప్పుడే నియజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేయవద్దని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజా రమేష్ సైతం సుమన్ కు మింగుడు పడటం లేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అలాగే, సుమన్ తనపై ఉన్న నెగిటివిటీని అంచనా వేసి, వచ్చే ఎన్నికల్ల్ మరో రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచనతో చెన్నూరుకు దూరం అయ్యారని ఆయన సన్నిహిత వర్గాల మాట.