Advertisement
ప్లేసు మారినా… హోదా చేంజ్ అయినా బండి సంజయ్ మాత్రం మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భావోద్వేగాలను రెఛ్చగొట్టడంలో బండి సంజయ్ ను మించిన వారెవరూ లేరనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. హిందూ – ముస్లిం ఎజెండాగా ఆయన వ్యాఖ్యలు ఓ వర్గాన్ని ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మళ్లీ అవే కామెంట్స్ చేశారు.
Advertisement
ఈ నెల 27న జరిగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లాంటివన్నారు బండి సంజయ్. బీజేపీ భారత్ టీం, కాంగ్రెస్ పాకిస్తాన్ టీం అని…కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్టేనని ప్రకటించేశారు.
Advertisement
ఇప్పుడంతా దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. ఇటీవలి పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలుపొందింది. ఈ సమయంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నది అయినా , బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అయినా ఇండియన్స్. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికో, పార్టీకో పాక్ నుంచి విరాళాలు అందాయా? అది రూడీ చేయాల్సింది కేంద్రమే. ఆ శాఖకు బండి సహాయమంత్రిగా ఉన్నారు.
తేల్చాలని అనుకుంటే వెంటనే తేల్చవచ్చు. కానీ, ఓట్ల కోసం పాక్ – ఇండియా అని భావోద్వేగాలను రెఛ్చగొట్టి పబ్బం గడపాలని కోరుకోవడం బండి స్థాయి లీడర్లకు సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక్కసారి వర్కౌట్ అయిన వ్యూహం మళ్లీ మళ్లీ వర్కౌట్ అవ్వదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.