Advertisement
గత నెలలో ముగిసిన టి20 ప్రపంచ కప్ 2022 లో భారత్ సెమి ఫైనల్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. సెమీస్ మ్యాచ్ ల్లో పేలవ బౌలింగ్ తో 169 పరుగులను కాపాడుకోలేక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. టైటిల్ ఫేవరెట్ అయిన భారత్ సెమిస్ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైంది. తోలుత చేతన్ శర్మ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్ కమిటీని తొలగించింది. ఇక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో కీలక సమావేశానికి పిలిచింది.
Advertisement
READ ALSO : Ginna Movie : ఓటీటీలోకి జిన్నా, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
టి20 వరల్డ్ కప్ 2022 లో టీమిండియా వైఫల్యంతో పాటు మరికొన్ని కీలక విషయాలపై రోహిత్, ద్రవిడ్ తో చర్చించనున్నారు బోర్డు పెద్దలు. అయితే, దీని వెనుక రహస్య అజెండా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సౌరవ్ గంగూలీని బలవంతంగా బోర్డు నుంచి బయటికి పంపేసిన బీసీసీఐ, ఇప్పుడు ద్రవిడ్ ను సాగనంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తిని సమావేశానికి పిలిచి, మీ వల్లే జట్టు విఫలమైందని నిందవేసి, ఏదో ఒక ఫార్మాట్ కు పరిమితం చేస్తే, ద్రవిడ్ కచ్చితంగా అంగీకరించడు. కచ్చితంగా పూర్తి స్థాయిలో కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. బీసీసీఐ పెద్దలకు కూడా ఇదే కావాలి.
Advertisement
వన్డే, టెస్టులకు ద్రవిడ్ ను పరిమితం చేసి, టీ 20 ఫార్మాట్లో ధోనీని కోచ్ గా నియమించాలనే నిర్ణయాన్ని ద్రవిడ్ ముందు బోర్డు ఉంచనున్నట్లు సమాచారం. అలాగే కెప్టెన్ గా కూడా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఆటగాడిగా రోహిత్ బోర్డు మాట వినితీరాల్సిందే. లేదా ఆట నుంచి తప్పుకోవాలి. రోహిత్ అంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ, ద్రవిడ్ మాత్రం ఖచ్చితంగా లొంగి ఉండే వ్యక్తి కాదు. అతని వ్యక్తిత్వం అలా ఉండనివ్వదు. ద్రవిడ్ లోని ఈ ఆత్మ గౌరవాన్ని అడ్డుపెట్టుకునే, బోర్డు పెద్దలు ద్రవిడ్ ను ఇంటికి సాగనంపాలని భావిస్తున్నారు. గంగూలి తర్వాత ద్రవిడ్ కూడా టీమిండియాను వదిలేస్తే, తర్వాత క్రికెట్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.