Advertisement
చాణక్య చెప్పినట్లు మనం పాటించామంటే జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఎటువంటి సమస్య కలిగినా కూడా చాణక్య చెప్పిన సూత్రాలతో సులువుగా పరిష్కారాన్ని పొందొచ్చు. ప్రతి ఇంట ఏదో ఒక సమస్య ఉండడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్నేహితుల మధ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి కలుగుతూనే ఉంటాయి. అయితే భార్యలో ఈ లక్షణాలు ఉంటే కష్టమని, చూసుకోవాలని చాణక్య అన్నారు. మరి చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇంట్లో భార్య సరిగ్గా ఉంటే, ధనలక్ష్మి ఆ ఇంట ఉంటుంది కానీ ఇటువంటి లక్షణాలు అస్సలు భార్యల్లో ఉండకూడదు.
Advertisement
Advertisement
ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో కలిసి బతకడం కష్టం అటువంటి భర్తకి శాంతి ఉండదు. కోపం కూడా భార్యలకి ఉండకూడదు. భార్యకి కోపం ఉంటే కూడా భర్త జాగ్రత్తగా ఉండాలి. చాలా కఠినమైన పదాలని కొంతమంది ఉపయోగిస్తారు. అలా మాట్లాడే భార్యతో కూడా కష్టం అటువంటి భార్య ఉంటే మనసుకి హాని కలుగుతుంది. మిమ్మల్ని కూడా పాడు చేస్తుంది. మీ జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. స్వలాభం కోసం అబద్ధాలు కొంత మంది స్త్రీలు చెప్తూ ఉంటారు. ద్రోహం చేయడానికి కూడా అటువంటి వారు వెనకాడరు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న భార్య కనుక ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి పురుషులు.
Also read: