Advertisement
ప్రస్తుత ఫోన్ పట్టుకున్నారంటే చాలు ముందుగా చూసేది వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ ద్వారా మెసేజ్లను ఇతరులకు పంపించవచ్చు. ఈ వాట్స్అప్ వచ్చినప్పటి నుంచి ఎవరికైనా విష్ చేయాలి అంటే దీని నుండే చేస్తున్నారు. వాట్సప్ ద్వారా ఎన్ని ఉపయోగాలో అనర్థాలు కూడా ఉన్నాయి. మనం వాట్సాప్ ను వాడే పద్ధతిలో తప్ప అసలు మిస్టేక్స్ చేయకూడదట.
Advertisement
తెలిసో తెలియకో ఈ మిస్టేక్స్ చేస్తే లక్షల రూపాయలు మాయమవుతాయని టెక్నికల్ నిపుణులు అంటున్నారు. గత కొంతకాలంగా వాట్స్అప్ స్పాం కాల్స్ వినియోగదారుల పట్ల శాపంగా మారాయి. వీటితో చాలామంది మోసాల బారిన పడుతున్నారు. ఈమధ్య గురుగ్రామ్ లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆన్లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకొని 42 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా చూసుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని ఆశ కల్పించారు. కొన్ని సామాజిక మధ్యమాల్లో చేరాలని కూడా సూచించారు.
Advertisement
టెక్నాలజిస్ట్ బాగా తెలిసిన ఇంజనీర్ కూడా వీరి మాయలో పడిపోయాడు. తెలిసి తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విచిత్రమైన అభ్యర్థనలు చేసిన వారిని అనుమానించాలి. నేరుగా ఆ వ్యక్తులకు లేదా సంస్థలకు ఫోన్ చేసి ధ్రువీకరించాలి. వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇవ్వొద్దు. గుర్తుతెలియని కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. ఆ కాల్స్ వెంటనే బ్లాక్ చేయాలి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లింక్స్ పంపి మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్,క్రెడిట్ కార్డ్స్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ సమాచారం అసలు చెప్పొద్దు. ఇలా చేస్తే మీ అకౌంట్ సేఫ్ గా ఉంటుంది.
మరి కొన్ని ముఖ్య వార్తలు :