Advertisement
తమిళనాడుకు చెందిన యువకుడు ఎంతో కష్టపడి కలెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన జీవిత చరిత్ర ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మెలోకటంకడు గ్రామానికి చెందిన శివగూరు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇక తండ్రి తాగుబోతు కావడంతో తల్లి కుటుంబ బాధ్యతలు మోస్తూ వచ్చింది. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు అనుభవించిన ప్రభాకరన్ చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. చాలా కష్టపడి చదివాడు.
also read: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
Advertisement
ఐఐటి మద్రాసులో సీటు సంపాదించాడు. ఓవైపు ఇంజనీరింగ్ చేస్తూనే మరోవైపు ట్యూషన్ లు చెబుతూ తన ఖర్చులకు డబ్బులు సంపాదించుకునే వాడు. అంతేకాకుండా సంపాదించిన దాంట్లో కొంత డబ్బును కుటుంబానికి కూడా పంపేవాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు. చివరికి ఉద్యోగాన్ని సాధించాడు. అయితే ప్రభాకరన్ ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకున్నాడు.
అంతేకాదు ఆ వైద్యురాలిని ప్రభాకరన్ కట్నం కూడా అడిగాడట. దీంతో ఆమె షాక్ అయింది. ఇంతకీ ఆ కలెక్టర్ గారు అడిగిన కట్నం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఏంటయ్యా అంటే వారంలో రెండు రోజులు గ్రామాల్లో ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని తన భార్యకు కండిషన్ పెట్టాడు. దీంతో ఆయన భార్య కూడా ఓకే చెప్పింది. ప్రస్తుతం వీరి వివాహ స్టొరీ విన్న వారంతా గ్రేట్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.
Advertisement
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023