Advertisement
ఆహారం విషయంలో తప్పులు చేయకూడదు. మనం తినే ఆహారం విషయంలో ఏమైనా పొరపాట్లు చేసామంటే ఖచ్చితంగా అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. రాత్రిపూట ఆహారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తినేయాలి. దాని వెనుక పెద్ద కారణమే ఉంది. తాజాగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం రాత్రిపూట త్వరగా తినడం వలన జీవిత కాలం పెరుగుతుందట. ఇటలీలోని ఓ గ్రామంలో ప్రజలపై జరిపిన ఈ అధ్యయనంలో 90 ఏళ్ల పైబడిన వాళ్ళు రాత్రి 7 గంటలకు భోజనం చేస్తున్నట్లు తేలింది.
Advertisement
తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తింటున్నట్లు తేలింది. వీళ్ళ ఆహారంలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రజల జీవనశైలి కూడా చురుగ్గా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. జీవనశైలి మన జీవన నాణ్యత పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. రాత్రి త్వరగా ఆహారం తినడం వలన జీర్ణక్రియకు ఎంతో మేలు కలుగుతుంది.
Advertisement
Also read:
ఏడు గంటలకు తినడం వలన నిద్రపోవడానికి తినడానికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. మీరు తిన్నది బాగా జీర్ణం అవుతుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి ఆహారాన్ని తినడానికి నిద్రపోవడానికి ఎక్కువ సమయం ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు తిన్నది బాగా జీర్ణం అవుతుంది. అనేక రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు. బరువు తగ్గడానికి కూడా అవుతుంది. రాత్రిపూట త్వరగా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. శరీరం ఇన్సులిన్ ని బాగా ఉపయోగిస్తుంది. చక్కర స్థాయిలు కూడా పెరగవు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!