Advertisement
సాధారణంగా పెద్దల మాట చద్దన్నం మూట అంటుంటారు. అలాంటి పెద్దలు ఏ విషయం చెప్పినా దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ దాగి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టే కళ్ళ కాటుక నుంచి, ఆడపిల్లలు ధరించే ముక్కు పుడక వరకు ప్రతి దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కలిగి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం.. ముక్కుపుడకకు చాలా విలువ ఉంది. అలాంటి ముక్కుపుడక ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ముక్కుపుడకను ఎక్కువగా ఎడమ వైపు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందట. జననాంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడీ ముక్కు ఎడమవైపు భాగంలో సంబంధం కలిగి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ ముక్కుపుడక ధరించడం వల్ల ఆడవాళ్ళ శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా, ఈ ముక్కుపుడక కాపాడుతుందట. అదేవిధంగా మహిళా ప్రసవ సమయంలో కూడా నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కోపం కూడా నియంత్రణలో ఉంటుందట. ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రత్యేక అందాన్ని ఇస్తుందని అంటున్నారు.