Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలతో పాటు , స్క్రీన్ ప్లే ను అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యామీనన్ నటించగా, రానాకు భార్యగా మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Also read: SR ఎన్టీఆర్ కు ఒక్క హైదరబాద్ లోనే ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయో తెలుసా..?
కాగా ఈ సినిమాలోని ఓ బిగ్గెస్ట్ మిస్టేక్ ను ప్రేక్షకులు పట్టుకున్నారు. అసలు ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు. సినిమాలో డానియల్ శేఖర్ ను అరెస్టు చేసినప్పుడు ఏడ్చినట్టు నటించి పవన్ కళ్యాణ్ తో గ్లాస్ లో మద్యం పోయించుకుంటాడు. అయితే ఆ సమయంలో డానియల్ శేఖర్ వీడియో తీస్తాడు. అంతేకాకుండా జైలు నుండి విడుదల కాగానే ఆ వీడియోను మీడియా వాళ్లకు పంపిస్తారు. దాంతో ఆ న్యూస్ టీవీలో రావడంతో పాటు భీమ్లా నాయక్ ను అరెస్టు చేస్తారు.
Advertisement
కానీ పోలీస్ స్టేషన్ లో ఒకేసారి వారానికి సంతకాలు పెట్టి అక్కడ నుండి వెళ్లడానికి రానా ఫోన్ లో ఉన్న వీడియోను ఇవ్వాలని, అది ఎస్పీ వద్దకు వెళ్లకూడదని కోరుతారు. కానీ డానియల్ ఆ ఫోన్ తీసుకురాడు. దాంతో స్టేషన్ లో పోలీసులు గోలగోల చేసేస్తారు. అయితే అప్పటికే టీవీలో వచ్చిన వీడియో ఎలాగో వైరల్ అవుతుంది. మళ్ళీ దానికోసం రానా చెప్పినట్టు చేయడంతో అక్కడ దర్శకుడు బిగ్ మిస్టేక్ చేసినట్టు క్లారిటీగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ పై ట్రోల్స్ వస్తున్నాయి. గురూజీ త్రివిక్రమ్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.
Also Read: “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?