Advertisement
గుజరాత్ లో త్వరలో జరిగే ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు జామ్ నగర్ నార్త్ నుంచి టికెట్ దక్కింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన రివాబా జడేజా 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన కర్నిసేన నాయకురాలైన రివాబా, మూడేళ్ల క్రితం బిజెపిలో చేరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బిజెపి.
Advertisement
అయితే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అతని భార్య రివాబా జడేజా పేరు పెట్టడంతో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆనందంలో దూకుతున్నారు. ఈ టేకింగ్ పై తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇంతలోనే జడేజాకు షాక్ తగిలింది. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున జడేజా సోదరి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. దాంతో ఇటు భార్య అటు సోదరి పోటీలో ఉండటంతో అయోమయంలో పడ్డాడు జడ్డు భాయ్. రవీంద్ర జడేజా, ప్రత్యర్థి బ్యాటర్లను తన బంతులతో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. కానీ ప్రస్తుతం రాజకీయాలు వేసిన బాల్ కు క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నాడు జడ్డు భాయ్.
Advertisement
జడేజా భార్యకు పోటీగా కాంగ్రెస్ తరపు నుంచి జడ్డుబాయ్ సోదరి నైనా జడేజాను బరిలోకి దింపుతున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఇదే జరిగితే జడ్డు పరిస్థితి ఏంటి అని అటు అభిమానులు, ఇటు ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ మాత శక్తి చారిటబుల్ ట్రస్టు ద్వారా జడేజా దంపతులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాంతో అక్కడ వారికి మంచి పేరు ఉంది. రివాబాకు పోటీగా నైనా జడేజాను బరిలోకి దింపితేనే బాగుంటుందని కాంగ్రెస్ వర్గాలు చర్చ నడుస్తోంది. ఇక గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
READ ALSO : T20 World Cup 2022 : సెమీస్ లో దారుణంగా ఓడిన టీమిండియాకు భారీ ఫ్రైజ్ మనీ