Advertisement
ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ. కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. కూటమి దెబ్బకు వైసీపీ ఇప్పటికే కోల్కొనేలా లేదు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో నాయకులు ఒక్కొక్కరూ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరూ రాజ్యసభ సభ్యులు పార్టీతో పాటుగా పదవులకు సైతం రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.
Advertisement
వైసీపీకి ఉమ్మడి కృష్ణ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసారు. ఆయనతో పాటుగా వైసీపీ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ టీడీపీలో చేరారు. నారా లోకేష్ సమక్షంలో రాఘవేంద్ర పసుపు జెండా కప్పుకున్నారు. వైసీపీ సిద్ధాంతాలు విధానాలు నచ్చక వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని నారా లోకేష్ తెలిపారు.
Advertisement
Also read:
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీని విడిచిపెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తున్నారని సమాచారం. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని విడిచిపెడడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గ కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. త్వరలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!