Advertisement
ఏడాది ఆగస్టు 25న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పిడియాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబర్ 29 పిడియాక్ట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తనపై నమోదు చేసిన పిడియాక్ట్ ను ఎత్తివేయాలని కమిటీకి విన్నవించుకున్నారు.
Advertisement
రాజా సింగ్ అయితే తనపై నమోదైన కేసులు అన్ని కొట్టి వేసినట్టు బోర్డు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. కానీ దీనిపై విచారణ జరిపిన బోర్డు పోలీసులు నమోదు చేసిన పిడియాక్ట్ ను సమర్ధించింది. పిడియాక్ట్ ఎత్తివేయాలన్న రాజా సింగ్ అభ్యర్థనను కమిటీ తిరస్కరించింది.ఇది ఇలా ఉండగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిడియాక్ట్ కేసులో ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాజా సింగ్ పై పిడియాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి సవాలు చేస్తూ ఆయన భార్య ఉషాబాయి సింగ్ దాకాలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె శ్రీదేవి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Advertisement
ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్ర రావు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని వాదనలు వినిపించారు. రాజాసింగ్ పై పిడి యాక్ట్ కేసుకు సంబంధించి ఆయనపై 12 నెలల పాటు నిర్బంధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న జీవో జారీ చేసినట్లు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పిడి యాక్ట్ సలహా మండలి కూడా దీన్ని ఆమోదించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 12 నెలల పాటు ప్రభుత్వం నిర్బంధం విధిస్తూ జీవో ఇవ్వడంతో హైకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తే తప్ప, రాజాసింగ్ ఏడాది పాటు జైల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also : రాహుల్ గాంధీ కోసం టాలీవుడ్ బ్యూటీ