Advertisement
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న వైరం చూస్తూనే ఉన్నాం. ఏ చిన్న విషయాన్ని వదలకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ ఏవైనా ఆధారాలు దొరికితే ఓ ఆటాడుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, పదో తరగతి పేపర్ లీకేజ్ ఇష్యూల్లో నిందితులు మీవాళ్లంటే మీ వాళ్లు అనుకుంటూ ఫోటోలు కూడా బయటపెట్టారు. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య ల్యాండ్ లడాయి జరుగుతోంది.
Advertisement
ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి.. తెలంగాణ మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. ధరణి తెచ్చింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణ కోసమేనా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా మంత్రి నిరంజన్ రెడ్డి భూకబ్జాలు అంటూ కొన్ని ఫోటోలను మీడియాకు చూపించారు. నిరంజన్ అగ్రి, హార్టికల్చర్ లోన్లతో ఫాంహౌస్ లు కట్టారని ఆరోపించారు. వనపర్తి జిల్లాలో 165 ఎకరాల్లో మంత్రి ఫాంహౌస్ ఉందన్న రఘునందన్.. కృష్ణానదిని ఆక్రమించుకుని ప్రహరీ కట్టారన్నారు.
Advertisement
మంత్రి ఫాంహౌస్ లో 3.5 ఎకరాల్లో సీసీ రోడ్లు వేశారని తెలిపారు రఘునందన్. భూకబ్జా చేయలేదని మంత్రి ప్రమాణం చేస్తారా? గట్టుకాడిపల్లి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా? తహశీల్దారు ఆఫీస్ దగ్థంలో పాత్ర లేదని ప్రమాణం చేస్తారా? అంటూ సవాళ్లు విసిరారు రఘునందన్. వ్యవసాయ శాఖ మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఫాంహౌస్ లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
మరోవైపు తనకు మూడు ఫాంహౌస్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్ లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కౌంటర్ ఇచ్చారు. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ భూమి ఉన్నా తమ పిల్లలు వదిలేస్తారన్నారు. అంతేకాదు, తాను తన పదవికి రాజీనామా చేస్తాననని, లేకుంటే నువ్వు రాజీనామా చేస్తావా? అంటూ రఘునందన్ కు కౌంటర్ ఛాలెంజ్ చేశారు. ఆయన చెబుతున్న మూడు వ్యవసాయ క్షేత్రాలకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్ ను తీసుకుని వెళ్లొచ్చు.. ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోండి అంటూ సవాల్ చేశారు నిరంజన్ రెడ్డి.