Advertisement
BJP Leader Madhavi Latha:బిజెపికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని చూస్తోంది. బిజెపి మొత్తం 17 ఎంపీ సీట్లకి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులని బరిలోకి దింపుతోంది. తొలి జాబితాలో 9 మందికి అవకాశాన్ని ఇచ్చింది. మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుండి మాధవి లతని బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే దీంతో ప్రతి ఒక్కరు కూడా మాధవి లత ఎవరా అని అరా తీయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి గూగుల్ లో విపరీతంగా వెతుకుతున్నారు. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ కొంపెల్ల మాధవి లత రిలీజియస్ ఆక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉంటారు.
Advertisement
Advertisement
హైదరాబాద్ యాకుత్ పుర నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగారు. ఈమె ఓయూ లో ఉన్నత విద్యను అభ్యసించారు భరతనాట్య నృత్యకారిణి. అలానే ఈమె ఆర్టిస్ట్, ఫిలాసఫర్ అలానే వ్యాపారవేత్త కూడా. విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాధ్ ని 2001లో ఈమె పెళ్లి చేసుకున్నారు. కొంపెల్ల విశ్వ నాథ్ మాధవి లత కి ముగ్గురు పిల్లలు. విరించి హాస్పిటల్ సిఎండిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
లతామా ఫౌండేషన్ చైర్ పర్సన్ కూడా హిందుత్వం భారతీయ సంస్కృతి మీద అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాల తో పాటు భారీ అగ్నిసాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి ఎంపీ అభ్యర్థి గా పోటీ చేయబోతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ వరుసగా ఎంపిక గెలిచారు ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ కి చెక్ పెట్టడానికి బిజెపి ప్రయత్నం చేస్తుంది మరి వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!