Advertisement
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై ఉన్న ఈ బ్రిడ్జ్ పైనుంచి పెద్ద సంఖ్యలో జనం నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 60 మందికి పైగా మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు.
Advertisement
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్ లను మోహరించారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది దాకా ఉన్నారు. వారిలో 100 మందికి పైగా నదిలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Advertisement
విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ.. సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు వెంటనే అవసరమైన సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం లభించేలా చూడాలని సూచించారు. మరిన్ని సహాయక బృందాలను వెంటనే ఘటనా స్ధలానికి పంపాలని మోడీ ఆదేశించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
క్షతగాత్రుల్లో చాలామంది టూరిస్టులే. నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. తాను అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్టు సీఎం పటేల్ ట్వీట్ చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ పై సామర్థానికి మించి భారీ సంఖ్యలో టూరిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.