Advertisement
రోజూ ఏదో ఒక అంశంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇష్టారితిన వ్యవహరిస్తున్నారు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బాట పట్టారు. గవర్నర్ల వ్యవస్థనే తప్పుబడుతూ ట్విట్టర్ లో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు కేటీఆర్.
Advertisement
బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్న మంత్రి.. ఎటువంటి సహకారం లేకుండా, ప్రతీకారం తీర్చుకుంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు గవర్నర్, తెలంగాణ గవర్నర్ తీరును తప్పుబడుతూ ఉన్న పేపర్ క్లిప్స్ ను జత చేశారు. దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా ఇదేనా? టీమిండియా స్ఫూర్తి ఇదేనా? అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Advertisement
కేటీఆర్ ట్వీట్ పై చర్చ సాగుతుండగా.. తెలంగాణ భవన్ లో మీడియా ముందుకొచ్చారు. కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని ఉక్కు ఫ్యాక్టరీల అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చిన వారికి అప్పగించడం కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని ఆరోపించారు. బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోడీని ఎన్నోసార్లు కలిశానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలపై మోడీ చేస్తున్న కుట్రను.. ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనుక భారీ కుట్ర ఉందన్న కేటీఆర్.. స్టీల్ ప్లాంట్ ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. అదానీ కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని నవరత్నాలను.. మోడీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బైలదిలాను కాపాడుకోవాలంటే.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని అన్నారు. రాజకీయాల కోసమే విశాఖ ఉక్కుపై మాట్లాడుతున్నామనేది అవాస్తవమన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కాదు.. కేంద్రం ఏం చేస్తుందన్నదే ముఖ్యమని చెప్పుకొచ్చారు కేటీఆర్.