Advertisement
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్, చంద్రబాబు భేటీ గురించే చర్చ జరుగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేతలు కాస్త ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఈక్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Advertisement
బాబు, పవన్ విడిపోతే ఆశ్చర్యపోవాలి గానీ కలిస్తే ఎందుకని సెటైర్లు వేశారు. వాళ్లిద్దరూ మొదటి నుంచి కలిసే ఉన్నారని తాము చెబుతున్నామన్నారు. వారిద్దరు కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా తాసారి తాము 175 సీట్లకు 175 సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
Advertisement
ఎంతమందికి ఎంత డబ్బులిచ్చామో తమ దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు సిద్ధార్థ్ రెడ్డి. ప్రతిపక్షాల దగ్గర ఏమైనా లెక్కలు ఉంటే తీసుకురావాలని సవాల్ చేశారు. దీనిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రానికి జగన్ మంచి చేస్తున్నారని, రాష్ట్రంలో మార్పు తెస్తున్నారన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంతమంది పొత్తుల కోసం తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు బైరెడ్డి హాజరైన కార్యక్రమంపై టీడీపీ, జనసేన పార్టీలు మండిపడుతున్నాయి. కొంతమూరు బ్రిడ్జి నుంచి కోరుకొండ మండలం గాడాల వరకు వైసీపీ నేతలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, సిద్ధార్థ్ రెడ్డి, జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ ర్యాలీపై ప్రతిపక్షాలు ఫైరవుతున్నాయి. ఏపీలో ఎమర్జెన్సీని మించిన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని.. వైసీపీ నేతలు విచ్చలవిడిగా రోడ్ షోలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని.. తాము ఏదైనా కార్యక్రమానికి తలపెడితే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారని నిలదీస్తున్నాయి.