Advertisement
కర్పూరం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. కర్పూరాన్ని మనం పూజల్లో వాడుతూ ఉంటాము. అయితే వీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా కర్పూరాన్ని పూజల్లో వాడుతున్నాము. అయితే ఆ వాసనకి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది కేవలం ఈ ఒక్క ప్రయోజనమే కాదు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. జలుబు దగ్గు వంటి సమస్యల్ని నయం చేయడానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. కర్పూరాన్ని వాసన పీలిస్తే జలుబు దగ్గు సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
Advertisement
దీన్ని పీల్చడం వలన అలసట కూడా దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలానే దీని వలన శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుందట. మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటివి కూడా కర్పూరం వాసనతో దూరం అవుతాయి. కర్పూరంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములని దూరం చేయగలవు. కర్పూరం పొడిలా చేసి రాస్తే నొప్పి త్వరగా వంటి సమస్యలు దూరం అయిపోతాయి. తీవ్రమైన నొప్పి కూడా తగ్గిపోతుంది.
Advertisement
Also read:
Also read:
చర్మం పై రాసినప్పుడు వెచ్చని అనుభూతిని ఇస్తుంది కండరాలు కీళ్లలో నొప్పి కూడా తగ్గుతుంది. కర్పూరాన్ని ఒక రుమాలలో చుట్టి వాసన పీలిస్తే జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నేరుగా కర్పూరాన్ని ముక్కులో వేసుకోవద్దు ఇబ్బందులు వస్తాయి. అలాగే కొంతమందికి వాసన పడదు అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడమే ఉత్తమం.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!