Advertisement
చాలామంది కొన్ని కాయిన్స్ ని లేదంటే డబ్బులను దాస్తు ఉంటారు. పాతకాలం నాటి నాణేలు, వస్తువులు, వివిధ దేశాల కరెన్సీలను సేకరిస్తూ ఉంటారు. మనలో కూడా చాలా మంది చిన్ననాటి వస్తువుల్ని కాయిన్స్ వంటి వాటిని దాచుకుంటూ ఉంటాం పాత కరెన్సీ నోట్లు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సీరియల్ నెంబర్లు లేదా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న రూపాయలు నోట్లు సేకరించి దాచిపెట్టిన వాళ్ళు ఇప్పుడు లక్షాధికారులు అవ్వబోతున్నారు. అది ఎలా అనేది చూస్తే.. ఇటువంటి రేర్ ఐటమ్స్ ని కలెక్ట్ చేసే వారిలో కొంత మంది ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టి వాటిని కొంటూ ఉంటారు.
Advertisement
జనరల్ గా అలాంటి వాళ్ళు పురాతన వస్తువులు వేలం వేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా పాత ఐదు రూపాయల నోట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నోట్లలో ఉండే ప్రత్యేకతమైన సీరియల్ నెంబర్ అందులోని కొన్ని ప్రత్యేక గుర్తులు లేదో చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే మార్కెట్లోకి ఎక్కువ ధరను పొందుతాయి. పాత కరెన్సీ నోట్లలో ఐదు రూపాయల నోటుకు కాస్త ప్రత్యేకమైన విలువ ఉంది. దాని సీరియల్ నెంబర్, డిజైన్ తదితర అంశాల్ని బట్టి కొంటూ ఉంటారు. 786 సంఖ్యకు ఇస్లామిక్ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది.
Advertisement
Also read:
ఈ సంఖ్య ఉన్న నోట్లను సేకరించడానికి ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతూ ఉంటారు ఈ నంబరు ఉంటే దాని విలువ ప్రస్తుతం లక్ష రూపాయలు వరకు పలుకుతోంది. అలాగే 123456 సీరియల్ నెంబర్లతో ఉన్న నోట్లు చాలా అరుదుగా ఉంటాయి ఇటువంటివి ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. కొన్ని ఐదు రూపాయల నోట్లలో ట్రాక్టర్ పై ఒక రైతు బొమ్మ ఉంటుంది ఇది కూడా చాలా అరుదు. ఇలాంటి వాటిని సేకరించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా ఉపయోగించని రూపాయల నోట్లు కూడా మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతాయి. పాత కరెన్సీ నోట్లను అంతర్జాతీయ వేలం వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈబే, కాయిన్ బజార్ వంటి వాటిలో అమ్మొచ్చు వీటిని లీగల్ గానే అమ్ముకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!